వాళ్లు నన్ను బాగా తిట్టి వెళ్లిపోయారు! నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం... సెంచరీ హీరో హారీ బ్రూక్ కామెంట్స్...

Published : Apr 14, 2023, 10:14 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో రషీద్ ఖాన్ మొట్టమొదటి హ్యాట్రిక్ తీస్తే, హారీ బ్రూక్ మొట్టమొదటి సెంచరీ హీరోగా నిలిచాడు. మొదటి మూడు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయి, తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన హారీ బ్రూక్, నాలుగో మ్యాచ్‌లో వాటికి సెంచరీతో సమాధానం చెప్పాడు..   

PREV
17
వాళ్లు నన్ను బాగా తిట్టి వెళ్లిపోయారు! నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం... సెంచరీ హీరో హారీ బ్రూక్ కామెంట్స్...

లూకీ ఫర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో 6, 4, 4, 4, 0, 4 బాది 23 పరుగులు రాబట్టిన హారీ బ్రూక్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లోనూ సునాయాసంగా బౌండరీలు బాదాడు. ఐపీఎల్ సీజన్ 16లో వచ్చిన మొట్టమొదటి సెంచరీ కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున సెంచరీ చేసిన మూడో బ్యాటర్ హారీ బ్రూక్ ..

27

ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున డేవిడ్ వార్నర్ రెండు సార్లు సెంచరీ చేయగా జానీ బెయిర్‌ స్టో 2019 సీజన్‌లో ఆర్‌సీపై సెంచరీ నమోదు చేశాడు. శిఖర్ ధావన్ 92, కేన్ విలియంసన్ 89 పరుగులు చేసినా సెంచరీ అందుకోలేకపోయారు..  
 

37

పాక్ సూపర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్‌లో సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హారీ బ్రూక్. క్రిస్ గేల్ వంటి హిట్లర్ల కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు...

47

టెస్టుల్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న హారీ బ్రూక్‌ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

57

తన రేటుకి తగ్గట్టుగా రెండు మ్యాచుల్లో సరిగ్గా 13 పరుగులే చేసిన హారీ బ్రూక్, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. కోట్లు తీసుకుని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడని హారీ బ్రూక్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది.. 
 

67
harry brook

‘ఐపీఎల్‌లో నా పర్ఫామెన్స్ చూద్దామని మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చారు. మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యానని బాగా తిట్టి, ఈ మ్యాచ్‌కి ముందే ఇంటికి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోగానే బాగా ఆడతానని తెలుసు...

77
harry brook

నా గర్ల్ ‌ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. తను చూస్తుంటే సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వాళ్లు ఈ ఇన్నింగ్స్ చూసి షాక్ అవుతారని అనుకుంటా...’ అంటూ నవ్వేశాడు హారీ బ్రూక్..

click me!

Recommended Stories