ఇక లాభం లేదు! నేనే దిగాలి... ఇంత కష్టంలోనూ బెంగళూరు వెళ్లి ఢిల్లీ టీమ్‌ని కలిసిన రిషబ్ పంత్...

Published : Apr 14, 2023, 07:52 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. సీజన్ ఆరంభం నుంచి ఢిల్లీ టీమ్‌కి ఏదీ కలిసి రావడం లేదు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకి దూరం కావడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేస్తున్నా, విజయాలు మాత్రం దక్కడం లేదు..

PREV
17
ఇక లాభం లేదు! నేనే దిగాలి... ఇంత కష్టంలోనూ బెంగళూరు వెళ్లి ఢిల్లీ టీమ్‌ని కలిసిన రిషబ్ పంత్...
(PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000318B)

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ చివరి బంతి వరకూ పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్, బోణీ మాత్రం కొట్టలేకపోయింది. తొలి 4 మ్యాచుల్లో నాలుగూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే తర్వాతి మ్యాచ్‌లో కచ్ఛితంగా గెలిచి తీరాల్సిందే...

27

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తర్వాతి మ్యాచ్ ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్న క్యాపిటల్స్, ప్రాక్టీస్ చేస్తోంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ టీమ్‌లో జోష్ నింపేందుకు బెంగళూరుకి వెళ్లాడు రిషబ్ పంత్...

37

ఢిల్లీ వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కి స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్, ఆ సమయంలో మోకాలి గాయంతో సరిగ్గా నడవలేక కుంటుతూ చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కి అతను హాజరు కాలేదు..

47

అయితే వరుస ఓటములతో కుదేలైన టీమ్‌లో జోష్ నింపేందుకు బెంగళూరు దాకా వెళ్లిన రిషబ్ పంత్, చిన్న స్వామి స్టేడియంలో ప్లేయర్ల ప్రాక్టీస్ సెషన్స్‌ని పరీక్షించాడు. పంత్ లేకపోయినా, అతను ఉన్నట్టుగా ఫీల్ కలిగించేలా చేస్తామని చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, తొలి మ్యాచ్‌లో పంత్ 17 నెంబర్ జెర్సీని డకౌట్‌కి తగిలించిన విషయం తెలిసిందే..

57
Image credit: Delhi Capitals

పెళ్లి కోసం స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ తిరిగి వచ్చి టీమ్‌తో కలిశాడు. అలాగే అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ బ్యాటుతో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం ఢిల్లీ టీమ్‌ని తీవ్రంగా కలవరబెడుతోంది. ముఖ్యంగా పృథ్వీ షా చెలరేగిపోతాడని ఆశించిన ఢిల్లీని అతని ఫెయిల్యూర్ చాలా ఇబ్బంది పెడుతోంది..

67
Image credit: Delhi Capitals

వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడినా గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి బంతి వరకూ పోరాడింది. అయితే ఆర్‌సీబీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని ఓడించిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది..

77

శార్దూల్ ఠాకూర్ విశ్వరూపం చూపించడంతో కేకేఆర్ చేతుల్లో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హై స్కోరింగ్ గేమ్‌లో 1 వికెట్ తేడాతో పోరాడి ఓడింది. ఢిల్లీపై గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్న ఆర్‌సీబీ, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా కలిసి రానుంది.. 

Read more Photos on
click me!

Recommended Stories