తమ్ముడు గ్రౌండ్‌లో.. అక్క స్టాండ్స్‌లో.. నాన్న డగౌట్‌లో.. వాంఖెడేలో సచిన్ ఫ్యామిలీ సందడి

Published : Apr 16, 2023, 05:02 PM IST

IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా  అని ఎదురుచూస్తున్న  తరుణం రానే వచ్చింది. భారత  క్రికెట్ దేవుడి  కుమారుడు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  

PREV
16
తమ్ముడు గ్రౌండ్‌లో.. అక్క స్టాండ్స్‌లో.. నాన్న డగౌట్‌లో.. వాంఖెడేలో సచిన్ ఫ్యామిలీ సందడి

2021 నుంచి  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో పాటు  భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్  అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కండ్లతో ఎదురుచూస్తున్న  తరుణం రానే వచ్చింది.  సచిన్  కుమారుడు అర్జున్ టెండూల్కర్  ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు.   

26

వాంఖెడే వేదికగా  కోల్కతా నైట్ రైడర్స్ తో  జరుగుతున్న  మ్యాచ్ లో  అర్జున్.. ముంబై తరఫున ఆడుతున్నాడు.   మ్యాచ్ కు ముందు   అర్జున్‌కు   రోహిత్ శర్మ  క్యాప్ అందజేయడం..  ఆ తర్వాత తన కొడుకుతో  సచిన్  ముచ్చటించిన వీడియోలు నెట్టింట  వైరల్ అవుతున్నాయి. 

36

అర్జున్ ఫస్ట్  మ్యాచ్ చూసేందుకు సచిన్ ఫ్యామిలీ వాంఖెడేలో సందడి చేసింది.   అర్జున్ అక్క సారా టెండూల్కర్.. ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకుని   స్టాండ్స్ లో సందడి చేసింది.   ఈ మ్యాచ్ కు సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్..  కేకేఆర్ తో మ్యాచ్ లో తొలి ఓవర్ ను  వేయాలని అర్జున్ కే బంతిని అందించాడు.  
 

46
Image credit: Mumbai Indians/Facebook

అర్జున్ ఫస్ట్ ఓవర్ వేసినంతసేపు వాంఖెడే అంతా   సచిన్ నామస్మరణతో మార్మోగిపోయింది.   అర్జున్ తో  ఫస్ట్ స్పెల్ లో రెండు వరుస ఓవర్లు వేయించాడు సూర్య. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్..  2 ఓవర్లలో 17 పరుగులిచ్చాడు.   

56

కాగా 2021 నుంచి ముంబై ఇండియన్స్ క్యాంప్ లో ఉంటున్న అర్జున్ నెట్ బౌలర్ గానే నెట్టుకొస్తున్నాడే తప్ప ఇప్పటిదాకా అతడికి  అవకాశమివ్వలేదు. సచిన్ కొడుకుగా ఉన్నా  ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా  ముంబై   టీమ్ మాత్రం అతడిని  బెంచ్ కే పరిమితం చేసింది.  ఎట్టకేలకు  నేటి మ్యాచ్ లో అతడిని  ప్రపంచానికి పరిచయం  చేసింది. 

66

మ్యాచ్ చూసేందుకు వచ్చిన సారా పక్కన వైట్ షర్ట్ వేసుకుని కూర్చుని ఉన్న వ్యక్తి  ఎవరు..? అని  నెటిజన్లు ఆసక్తిగా  సెర్చ్  చేస్తున్నారు.   టీమిండియా యువ క్రికెటర్  శుభ్‌మన్ గిల్ తో బ్రేకప్ అయ్యాక   సారా  డిప్రెషన్ లోకి వెళ్లగా  అతడే   ఓదార్చాడని, అతడి పేరు కమల్ అని.. ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారని   ట్విటర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

click me!

Recommended Stories