స్లో అయితే బ్యాన్ పడుద్ది! విరాట్ కోహ్లీతో పాటు ధోనీ, పాండ్యా, శాంసన్‌లపై వేలాడుతున్న బ్యాన్ కత్తి...

First Published Apr 26, 2023, 7:29 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫస్టాఫ్ రసవత్తరంగా ముగిసింది. చాలా తక్కువ మ్యాచులు మాత్రమే వన్‌సైడెడ్‌గా సాగి, ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తే... మెజారిటీ మ్యాచులు ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగి ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీతో పాటు ధోనీ, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్‌, డేవిడ్ వార్నర్, కెఎల్ రాహుల్‌పై బ్యాన్ కత్తి వేలాడుతోంది...
 

ఐపీఎల్ 2023 సీజన్‌లో స్లో ఓవర్ కారణంగా ఇప్పటికే ఆర్‌సీబీ కెప్టెన్లు ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ ఫైన్‌లు కట్టారు. మొదటి తప్పిదంగా ఫాఫ్ డుప్లిసిస్‌కి రూ.12 లక్షల ఫైన్ వేసి వదిలేసిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్, తాత్కాలిక సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా స్లో ఓవర్ రేటును కొనసాగించడంతో 24 లక్షల మ్యాచ్ ఫీజును కోత వేసింది... టీమ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కత్తిరించింది.
 

sanju kohli dhoni

ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సీజన్‌లో రెండు సార్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా కట్టింది. మరోసారి ఈ తప్పు రిపీట్ అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే సారథిపై ఓ మ్యాచ్ నిషేధం పడబోతోంది. ఫాఫ్ డుప్లిసిస్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో విరాట్ కోహ్లీ మరో రెండు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయబోతున్నాడు...

Latest Videos


David Warner

ఇంకోసారి ఆర్‌సీబీ షెడ్యూల్ టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేకపోతే కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ది కూడా ఇదే పరిస్థితి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచినా, స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షలు ఫైన్ కట్టాడు డేవిడ్ వార్నర్. ఇంకో రెండుసార్లు ఈ తప్పు రిపీట్ చేస్తే వార్నర్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది..


టేబుల్ టాపర్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ కూడా ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్ కట్టారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్ చెల్లించాడు...
 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఈ స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా చెల్లించాడు. దీంతో వీళ్లు కూడా ఐపీఎల్ 2023 సీజన్ సెకండ్ హాఫ్‌లో మళ్లీ షెడ్యూల్ టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు...
 

Image credit: PTI

కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కూడా స్లో ఓవర్ రేటు కారణంగా బ్యాన్ పడే లిస్టులో ఉన్నాడు. 7:30 నిమిషాలకు ప్రారంభమవుతున్న మ్యాచులు సజావుగా సాగితే 11:15 నుంచి 11:20 నిమిషాలకు పూర్తయిపోవాలి. అయితే కొన్ని మ్యాచులు 11:45 వరకూ సాగుతున్నాయి. విలువైన సమయాన్ని వృథా చేస్తున్న ఆ కెప్టెన్లపై ఇలా వేటు వేయనుంది ఐపీఎల్... 

click me!