అప్పుడు ‘RRR’, ‘KGF2’ దెబ్బ... మరి ఐపీఎల్ 2023 సీజన్‌ రేటింగ్స్‌ని ‘దసరా’ దెబ్బతీస్తుందా...

Published : Mar 31, 2023, 05:01 PM ISTUpdated : Mar 31, 2023, 05:04 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత సక్సెస్ దక్కలేదు. ఈసారి సరికొత్త హంగులు అద్దుకుని, జనాల ముందుకి రానుంది ఐపీఎల్...  

PREV
19
అప్పుడు ‘RRR’, ‘KGF2’ దెబ్బ... మరి ఐపీఎల్ 2023 సీజన్‌ రేటింగ్స్‌ని ‘దసరా’ దెబ్బతీస్తుందా...
Image credit: PTI

ఐపీఎల్ 2021 సీజన్ సూపర్ సక్సెస్ తర్వాత 10 ఫ్రాంఛైజీలతో ఐపీఎల్ 2022 సీజన్‌ని తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌కి రావాల్సినంత క్రేజ్ కానీ రేటింగ్, వ్యూయర్‌షిప్ కానీ రాలేదు. దీనికి ప్రధాన కారణం రెండు సినిమాలు...

29

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ఒక్క రోజు ముందు  ‘RRR’ సినిమా విడుదలైంది. ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడం, ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి...
 

39

‘RRR’ సినిమా ప్రభంజనం ముందు ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమైన విషయాన్ని కూడా జనాలు పట్టించుకోలేదు.  ‘RRR’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త శాంతించగానే ‘KGF-2’ విడుదలై, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘KGF’ సినిమాకి తగ్గకుండా రూపొందిన సీక్వెల్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. ఈ రెండు సినిమాల హడావుడి తగ్గేసరికి ఐపీఎల్ 2022 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది...

49

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మ్యాచుల్లో ఓడిపోతే అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. మాహీని టార్గెట్ చేస్తూ సైబర్ దాడులు చేశారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అలాంటివేమీ జరగలేదు. కారణం చెన్నై ఫ్యాన్స్, 2022 సీజన్‌ని పెద్దగా పట్టించుకోకపోవడమే...
 

59
Image credit: Mumbai Indians

ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు పెద్దగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేని రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడం కూడా ఐపీఎల్ 2022 సీజన్‌కి పెద్దగా రేటింగ్స్ రాకపోవడానికి ప్రధాన కారణం...
 

69

ఈసారి కూడా ఐపీఎల్‌కి ‘దసరా’ రూపంలో  ఓ సినిమా అడ్డుగా నిలిచింది. మార్చి 30న విడుదలైన ‘దసరా’కి మంచి రేటింగ్స్ దక్కాలి. తొలి రోజు రికార్డు కలెక్షన్లు కూడా రాబట్టింది ‘దసరా’. అయితే ‘దసరా’ మూవీని, ‘RRR’,‘KGF-2’ సినిమాలతో పోల్చడం కాస్త అతిశయోక్తే అవుతుంది.. అక్కడ స్టార్ హీరోలు లేరు, స్టార్ దర్శకుడు కూడా లేడు...

79

అంతేకాకుండా ‘దసరా’ హైప్, తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కాబట్టి ఐపీఎల్ 2023 సీజన్‌పై ఈ సినిమా ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అలాగని పూర్తిగా పడదని మాత్రం చెప్పలేం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా’ ఎఫెక్ట్ కచ్ఛితంగా ఉండొచ్చు.. సల్మాన్ హీరోగా నటించిన ‘కిసి కా భాయ్, కిసి కా జాన్’ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది...
 

89
Image: Bathukamma song still / YouTube

సల్మాన్ ఖాన్ సినిమా విడుదలయ్యే సమయానికి ఐపీఎల్‌ ఫుల్లు జోరులో ఉంటుంది. కాబట్టి ఆ సినిమా ప్రభావం కూడా ఐపీఎల్ 2023 సీజన్‌పై పడే అవకాశం తక్కువే. సినిమాకీ, క్రికెట్‌కీ మధ్య జరిగే పోటీలో గత సీజన్‌లో రెండు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. అయితే ఈసారి క్రికెట్‌కి సక్సెస్ దగ్గే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.. 

99

సినిమాకీ, క్రికెట్‌కీ సంబంధం లేదని కొందరు కొట్టేస్తుంటారు? అయితే మూవీకి ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్లే కీలకం. సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. కాబట్టి సినిమా చూడాలా? లేక ఐపీఎల్ మ్యాచులు చూడాలా? అనే నిర్ణయంపై బాక్సాఫీస్ కలెక్షన్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేటింగ్స్ ఆధారపడి ఉంటాయి.. 

click me!

Recommended Stories