ఫ్యాన్స్ కోసమే ధోనీ నొప్పిని భరిస్తూ ఆడుతున్నాడు, అది వదిలేస్తే... సీఎస్‌కే కోచ్ షాకింగ్ కామెంట్స్...

First Published May 20, 2023, 1:16 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ, పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడని బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. ధోనీ మాత్రం ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా స్పందిస్తున్నాడు. ఐపీఎల్ రిటైర్మెంట్‌ గురించి పక్కనబెడితే ధోనీ బ్యాటింగ్ చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు..

Dhoni

ఐపీఎల్ 2023 సీజన్‌లో 9 సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, మొత్తంగా 3 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 98 పరుగులు చేశాడు. అంటే మాహీ బ్యాటు నుంచి వచ్చిన పరుగుల్లో 72 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి...

MS Dhoni Ice Pack

‘ధోనీ తన బ్యాటింగ్ పొజిషన్ గురించి చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఆఖరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కి రావాలని ఫిక్స్ అయ్యాడు. కారణం అతని మోకాలి గాయమే...

Latest Videos


MS Dhoni

మాహీ 100 ఫిట్‌గా లేకపోయినా తన బెస్ట్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. కేవలం ఫ్యాన్స్ కోసమే నొప్పిని భరిస్తూనే, టోర్నీ మొత్తం ఆడాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆఖర్లో ఒకటి, రెండు ఓవర్లు ఉన్నప్పుడే బ్యాటింగ్‌కి వస్తున్నాడు..

ఇప్పుడు అతను ఉన్న పరిస్థితుల్లో 10 లేదా 11, 12వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు. గాయం కారణంగా వీలైనంత ఆలస్యంగా క్రీజులోకి వెళ్లాలని అనుకున్నాడు...

శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అజింకా రహానే, అంబటి రాయుడు కూడా బాగా ఆడుతున్నారు. వారికి అవకాశం ఇచ్చి, ఆఖర్లో తాను బ్యాటింగ్‌కి వెళ్లి బౌండరీలు కొట్టాలని అనుకుంటున్నాడు...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000329B)


ఈ సీజన్‌లో మా టీమ్‌కి ఎక్కడికి వెళ్లినా హోం గ్రౌండ్‌లో దక్కినంత సపోర్ట్ దక్కింది. ధోనీ లాంటి లెజెండ్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. లేకపోతే ఇలాంటి వాతావరణం అస్సలు చూసేవాళ్లం కాదు...

మాహీ ఇంకా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ట్రైయినింగ్‌కి, ప్రాక్టీస్ సెషన్స్‌కి వస్తూ మిగిలిన యంగ్ ప్లేయర్లను ఉత్సాహపరుస్తున్నాడు. ధోనీలో ఇంకా సిక్సర్లు బాదే సత్తా ఉంది. నాకు తెలిసి కీపింగ్ చేయకపోతే మాహీ ఇంకో ఐదేళ్లు ఆడగలడు...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ... 

click me!