ఆఖరి మ్యాచ్ తేడా కొడితే ఆర్‌సీబీ అస్సామే... ఆఖరి లీగ్ మ్యాచ్ రిజల్ట్ తేలే వరకూ...

Published : May 20, 2023, 12:06 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ క్లైమాక్స్‌కి చేరుకుంది. గ్రూప్ స్టేజీలో ఆఖరి 4 మ్యాచులే మిగిలి ఉన్నా ఇప్పటికే ప్లేఆఫ్స్‌పై క్లారిటీ రాలేదు. గ్రూప్ స్టేజీలో ఆఖరి మ్యాచ్ ఫలితం తేలే వరకూ ప్లేఆఫ్స్‌ బెర్తులపై సస్పెన్స్ కొనసాగనుంది...

PREV
16
ఆఖరి మ్యాచ్ తేడా కొడితే ఆర్‌సీబీ అస్సామే... ఆఖరి లీగ్ మ్యాచ్ రిజల్ట్ తేలే వరకూ...
rcb

18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటిదాకా గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లేఆఫ్స్ బెర్తే కాదు, టేబుల్ టాపర్‌గా మొదటి క్వాలిఫైయర్ ఆడడమూ కన్ఫార్మ్ చేసుకుంది...

26

చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి లీగ్ మ్యాచుల్లో ఎంత తేడాతో గెలిచినా.. గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్ చేరతాయి. నెట్ రన్ రేట్ బాగున్న జట్టు, గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్, తక్కువగా ఉన్న జట్టు ఎలిమినేటర్ మ్యాచులు ఆడతాయి...
 

36
Image credit: PTI

నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి తీరాల్సిందే. ముంబై ఇండియన్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది..

46

నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడితే... ఆర్‌సీబీ, టైటాన్స్‌పై గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ చేరుతుంది..
 

56

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతుల్లో ముంబై ఇండియన్స్ ఓడితే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడినా ప్లేఆఫ్స్ చేరవచ్చు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 5 అంతకంటే తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పరుగుల తేడాతో ఓడినా నెట్ రన్ రేట్ తేడా కొట్టేస్తుంది...

66

మొత్తానికి ఐపీఎల్ 2023 సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముందుగానే తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ప్లేఆఫ్స్ చేరి టాప్‌లో నిలిచిన గుజరాత్ టైటాన్స్... మిగిలిన మూడు ప్లేఆఫ్స్ బెర్తులను డిసైడ్ చేయబోతున్నాయి.. 
 

click me!

Recommended Stories