15 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్... ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అరుదైన ఫీట్...

Published : May 20, 2023, 12:29 PM ISTUpdated : May 20, 2023, 01:12 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరినా చేరకపోయినా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు..   

PREV
17
15 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్... ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అరుదైన ఫీట్...
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్... కేకేఆర్‌తో మ్యాచ్‌లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. 14 మ్యాచుల్లో 48.08 యావరేజ్‌తో 163.61 స్ట్రైయిక్ రేటుతో 625 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్... టాప్ 5లో ఉన్న ప్లేయర్లలో అత్యధిక స్ట్రైయిక్ రేటు ఉన్న బ్యాటర్ కూడా..

27
Image credit: PTI

ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, ఈ సీజన్‌లో 55 ఫోర్లు, 36 సిక్సర్లు బాదితే యశస్వి జైస్వాల్ 82 ఫోర్లు, 26 సిక్సర్లతో సీజన్‌లోనే అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు..

37

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 15 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు యశస్వి జైస్వాల్. ఐపీఎల్ 2008 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్, 616 పరుగులు చేశాడు...
 

47
Image credit: PTI

ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా షాన్ మార్ష్ రికార్డు 15 ఏళ్లుగా అలాగే ఉండేది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు యశస్వి జైస్వాల్, 625 పరుగులతో టాప్‌లో నిలిచాడు..

57

ఇంతకుముందు భారత జట్టు తరుపున ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్. 2020లో ఇషాన్ కిషన్, 516 పరుగులు చేస్తే, సూర్యకుమార్ యాదవ్ 2018 సీజన్‌లో 512 పరుగులు చేశాడు. 2020 సీజన్‌లో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. 2021లో ఇషాన్ కిషన్‌తో కలిసి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు..

67
Image credit: PTI

21 ఏళ్ల యశస్వి జైస్వాల్, ప్రస్తుతానికి టీమిండియా తరుపున ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే 576 పరుగులతో ఉన్న శుబ్‌మన్ గిల్, జైస్వాల్‌ని దాటేయొచ్చు...
 

77
Image credit: PTI

ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌తో పాటు మొదటి క్వాలిఫైయర్, ఫైనల్ లేదా రెండో క్వాలిఫైయర్ మ్యాచులు ఆడడం పక్కా. దీంతో గిల్‌కి యశస్వి జైస్వాల్‌కి ఉన్న 49 పరుగుల తేడాని దాటేందుకు 3 మ్యాచులు దొరుకుతాయి..

click me!

Recommended Stories