సచిన్ టెండూల్కర్ ముందు ధోనీ క్రేజ్ చాలా చిన్నది.. కిరన్ పోలార్డ్ షాకింగ్ కామెంట్స్...

First Published Apr 7, 2023, 7:55 PM IST

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్టేడియం అంతా పసుపు వర్ణం అయిపోయింది. సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ కంటే ఎక్కువగా ధోనీకి సపోర్టర్లు ఎక్కువగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. మాహీ క్రేజ్‌కి ఇది ఓ శాంపిల్ మాత్రమే...

Image credit: PTI

ఆర్‌సీబీకి చిన్నస్వామి స్టేడియంలో బీభత్సమైన సపోర్ట్ ఉంటుంది, అలాగే ముంబై ఇండియన్స్‌కి వాంఖడే స్టేడియంలో, కోల్‌కత్తా నైడ్‌రైడర్స్‌కి ఈడెన్ గార్డెన్స్‌లో మంచి మద్ధతు లభిస్తుంది. అయితే ఈ స్టేడియాల్లో కూడా సీఎస్‌కే మ్యాచ్ జరుగుతుందంటే స్టాండ్స్ అన్నీ మాహీ సపోర్టర్స్‌తో పసుపు వర్ణం అయిపోతాయి...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000319B)

మహేంద్ర సింగ్ ధోనీ వస్తే, ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా సీఎస్‌కేకి సపోర్ట్ చేస్తారని విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఫ్రాంఛైజీతో సంబంధం లేకుండా మాహీ బ్యాటింగ్‌ని చూసేందుకు ఇష్టపడతారు అభిమానులు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాహీ ఆడింది మూడు బంతులే అయినా ఆ రెండు నిమిషాలు స్టేడియం మార్మోగిపోయింది.. 

Latest Videos


మార్క్ వుడ్ బౌలింగ్‌లో ధోనీ సిక్సర్లు కొడుతుంటే స్టేడియమంతా కేకలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. స్వయంగా మార్క్ వుడ్, తన జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత సౌండ్ వినలేదని చెప్పాడు. అయితే ముంబై ఇండియన్స్ మాజీ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ మాత్రం ఇలాంటి అనుభవాన్ని ఇంతకుముందే చూశామని అంటున్నాడు..

MS Dhoni

‘ధోనీకి ఇది ఆఖరి సీజన్ అనే వార్తలు రావడం వల్లనేమో అతను ఎక్కడికి వెళ్లినా బీభత్సమైన సపోర్ట్ దక్కుతోంది. హోంగ్రౌండ్ అయినా లేక వేరే గ్రౌండ్‌లో ఆడినా అందరూ మాహీ సపోర్టర్లే కనిపిస్తున్నారు. భారత క్రికెట్‌కి, ఐపీఎల్‌కి అతను చేసిన సేవలకు దక్కుతున్న గౌరవం ఇది..

Dhoni-Sachin

అయితే మేం ఇలాంటి అనుభవన్ని చాలా ఏళ్ల క్రితమే అనుభూతి చెందాం. మా ఐకాన్ సచిన్ టెండూల్కర్ టీమ్‌లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా, ‘సచిన్... సచిన్...’ అనే అరుపులతో స్టేడియాలు దద్దరిల్లేవి.. ముంబై ఇండియన్స్‌కి ప్రతీ చోట సపోర్ట్ దక్కేది..

Dhoni sachin

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ కూడా క్రికెట్ లెజెండ్స్. వాళ్లు చేసిన సేవలకు ఈ మాత్రం సపోర్ట్ దక్కడంలో ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే సచిన్ టెండూల్కర్ ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించారంటే మాటలు కాదు...’ అంటూ కామెంట్ చేశాడు కిరన్ పోలార్డ్...

ఐపీఎల్ 2013 సీజన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్‌కి కొన్ని సీజన్లలో కోచ్‌గా, మెంటర్‌గా వ్యవహరించాడు. 2020 ఐపీఎల్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ, ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది..

click me!