ఐపీఎల్‌ EL Clasicoకి సర్వం సిద్ధం... ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే మధ్య మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్...

First Published Apr 7, 2023, 6:48 PM IST

ఐసీసీ టోర్నీల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ఉండే క్రేజ్ మరే మ్యాచ్‌కి ఉండదు. ఈ రెండు జట్లు తలబడితే స్టేడియం హౌస్ ఫుల్ కావాల్సిందే! టీఆర్‌పీలు బద్ధలు కావాల్సిందే. ఐపీఎల్‌లో అలాంటి క్రేజ్ ఉన్న మ్యాచ్.. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్...

ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌ కోసం అన్నీ ఫ్రాంఛైజీల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే ఈ ఫైట్‌ని ఐపీఎల్‌ El Clasico అని కూడా పిలుస్తారు. అసలు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి?

ఓవైపు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో మ్యాచ్ ఆడుతుంటే జనాలు అంతా సీఎస్‌కే, ముంబై మ్యాచ్ గురించే చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ ‘ఎల్ క్లాసికో’ గోల ఏంటి? ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగినప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై మాజీ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్... ‘ఎల్ క్లాసికో’ (El clasico) అంటూ చెప్పారు...

Latest Videos


(PTI PhotoR Senthil Kumar)(PTI04_02_2023_000246B)

ఫుట్‌బాల్‌లో బార్సిలోనా, రియాల్ మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌ని ఇలా ఎల్ క్లాసికో అని పిలుస్తారు. క్రికెట్‌లో, అదీ ఐపీఎల్‌లో అలాంటి నేమ్‌, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌లకు దక్కింది... ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్... ఆ తర్వాతి స్థానం నాలుగు టైటిల్స్‌తో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌దే. అనవసరంగా రెండేళ్లు బ్యాన్ పడింది కానీ, లేకుంటే, ఇప్పటికి చెన్నై  ఖాతాలో కూడా ఐదు టైటిల్స్ ఉండేవంటారు సీఎస్‌కే ఫ్యాన్స్...

ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐపీఎల్‌లో మిగిలిన అన్ని జట్లపై ఘనమైన రికార్డు ఉంది. అయితే ముంబై ఇండియన్స్‌కి సీఎస్‌కేపై అదిరిపోయే రికార్డు ఉంది... ఐపీఎల్‌లో మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య 34 మ్యాచులు జరిగాయి. ఇందులో గ్రూప్ మ్యాచులు పోగా ప్లే ఆఫ్స్‌లో 9 సార్లు, ఫైనల్స్‌లో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలబడ్డాయి...

నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ ఓపెనర్ మ్యాచులు జరిగాయి.  సీఎస్‌కేపై అత్యధికంగా 20 మ్యాచుల్లో విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్... సీఎస్‌కేకి ముంబైపై 13 మ్యాచుల్లో విజయాలు దక్కాయి...

2010 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్... సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్, టైటిల్ సాధించలేకపోయింది... అయితే ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది... రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్...

ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ అయితే ఎవ్వరూ మరిచిపోలేరు. ఒక్క పరుగు, ఒకే ఒక్క పరుగు తేడాతో టైటిల్‌ని కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్‌‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మజాని అందించాయి... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. చెరో 4 మ్యాచుల్లో గెలిచి 10 మ్యాచుల్లో పరాజయాలు అందుకున్నాయి. అలాంటి సీజన్‌లోనూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌‌లు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందించాయి...
 

CSK vs MI

ఐపీఎల్ 2022లో ముంబై, సీఎస్‌కే మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుని ఊపిరి పీల్చుకుంది చెన్నై సూపర్ కింగ్స్. రెండో మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 15 ఓవర్లలో ఛేదించి, సీఎస్‌కేపై ప్రతీకారం తీర్చుకుంది ముంబై ఇండియన్స్.. దీంతో ఈసారి ఇరు జట్లలో పైచేయి ఎవరిది అవుతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. 

click me!