బంగ్లాతో రెండో టెస్టుకి ముందు టీమిండియాకి మరో షాక్... ప్రాక్టీస్‌లో కెఎల్ రాహుల్‌కి గాయం...

Published : Dec 21, 2022, 03:45 PM IST

బంగ్లాదేశ్ టూర్‌లో టీమిండియాని గాయాల బెడద వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ, కుల్దీప్ సేన్, దీపక్ చాహార్ గాయాలతో సిరీస్ నుంచి మధ్యలో తప్పుకోగా రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ, మూడో వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. తాజాగా ఈ లిస్టులో కెఎల్ రాహుల్ కూడా చేరాడు..

PREV
17
బంగ్లాతో రెండో టెస్టుకి ముందు టీమిండియాకి మరో షాక్... ప్రాక్టీస్‌లో కెఎల్ రాహుల్‌కి గాయం...

రోహిత్ శర్మ గాయపడడంతో తాత్కాలిక సారథిగా బాధ్యతలు అందుకున్న కెఎల్ రాహుల్, మూడో వన్డేలో ఘన విజయాన్ని అందుకున్నాడు. తొలి టెస్టులోనూ భారత జట్టు భారీ తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తు చేసింది..

27
KL Rahul

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్‌కి గాయమైంది. ఢాకాలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న కెఎల్ రాహుల్‌ చేతికి ఓ బంతి బలంగా తాకింది. నొప్పిని భరించలేకపోయిన కెఎల్ రాహుల్... ప్రాక్టీస్ సెషన్స్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు...

37

‘కెఎల్ రాహుల్‌కి గాయమైన మాట వాస్తవమే. అయితే అది అంత తీవ్రమైనదేమీ కాదు. డాక్టర్లు, అతని చేతిని పరీక్షిస్తున్నారు. నాకు తెలిసి రాహుల్, రేపు జరిగే రెండో టెస్టులో ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. .
 

47
India vs Bangladesh

ఒకవేళ కెఎల్ రాహుల్ గాయం కారణంగా రెండో టెస్టులో బరిలో దిగకపోతే మాత్రం ఈ ఏడాదిలో మరో కొత్త కెప్టెన్ సారథ్యంలో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి కెప్టెన్సీ చేసిన జస్ప్రిత్ బుమ్రా కూడా గాయాలతో జట్టుకి దూరంగా ఉన్నారు...

57

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి ఛతేశ్వర్ పూజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా రెండో టెస్టుకి అందుబాటులో లేకపోతే లెక్కప్రకారం ఛతేశ్వర్ పూజారాకే కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది...
 

67
Pujara-Gill

ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్... ఇలా ఈ ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది టీమిండియా. ఈ లిస్టులో ఛతేశ్వర్ పూజారా కూడా చేరతాడా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. 

77
Rishabh Pant-Pujara

కెఎల్ రాహుల్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ 22, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాహుల్ గాయం కారణంగా తప్పుకుంటే శ్రీకర్ భరత్, లేదా అభిమన్యు ఈశ్వరన్‌కి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు.. లేదా శార్దూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకుని పూజరాతో గిల్ ఓపెనింగ్ చేసే అవకాశమూ ఉంది.

click me!

Recommended Stories