అదే జరిగితే ఆర్‌సీబీ, లక్నో మధ్య ఎలిమినేటర్ మ్యాచ్... మరోసారి కోహ్లీ వర్సెస్ గంభీర్, నవీన్...

Published : May 17, 2023, 04:57 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ప్రీ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ వారంతో లీగ్ మ్యాచులు ముగిసి, వచ్చే వారంలో ప్లేఆఫ్స్ జరగబోతున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరగా రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ నుంచి 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ వరకూ 7 టీమ్స్‌కి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉన్నాయి..

PREV
18
అదే జరిగితే ఆర్‌సీబీ, లక్నో మధ్య ఎలిమినేటర్ మ్యాచ్... మరోసారి కోహ్లీ వర్సెస్ గంభీర్, నవీన్...
gambhir kohli

ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమైపోతుంది. తర్వాతి మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులు ఆడనుంది ఆర్‌సీబీ..

28

ఈ రెండింట్లో ఓ మ్యాచ్ గెలిచి, ఓ మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరడం కష్టమైపోతుంది. అప్పుడు 14 పాయింట్లతో ఉండే ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ ఆడే మ్యాచుల రిజల్ట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది..
 

38
Kohli vs Mishra and Naveen

15 పాయింట్లతో టాప్ 3లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నోకి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే లక్నో 17 పాయింట్లతో మొదటి క్వాలిఫైయర్ కూడా ఆడే ఛాన్స్ దక్కించుకుంటుంది.. అయితే అలా జరగాలంటే చెన్నై సూపర్ కింగ్స్, చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతుల్లో ఓడిపోవాలి. లేదా సీఎస్‌కే గెలిచినా మార్జిన్ చాలా తక్కువగా ఉండాలి..

48

సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రెండు మ్యాచుల్లో హై డ్రామా నడిచింది. బెంగళూరులో ఆఖరి బంతికి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ అతిగా సెలబ్రేట్ చేసుకుంది. ఆవేశ్ ఖాన్ హెల్మెన్ నేలకేసి బాది సెలబ్రేట్ చేసుకుంటే, గౌతమ్ గంభీర్... బెంగళూరు ఫ్యాన్స్‌ని సైలెంట్‌గా ఉండాల్సిందిగా సైగలు చేశాడు..

58

లక్నోలో ఎల్‌ఎస్‌జీ, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో మినీ వార్ జరిగింది. లక్నోపై ఆర్‌సీబీ గెలిచినా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆఫ్ఘాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌తో మొదలైన గొడవ, చాలా పెద్ద రచ్చకు దారి తీసింది..
 

68

ఈ రెండు జట్ల మధ్య మొదటి ఎలిమినేటర్ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సీఎస్‌కే, తన ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌ని ఓడిస్తే 17 పాయింట్లతో ఉంటుంది... ఆర్‌సీబీ తర్వాతి రెండు మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది. లక్నో తన ఆఖరి మ్యాచ్‌లో ఓడినా 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరగలుగుతుంది. (పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో ఓడిపోతే..)

78

అదే జరిగితే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్యే ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఎలిమినేటర్‌లో లక్నోని ఓడించిన ఆర్‌సీబీ, రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడింది..
 

88
Mayers and Kohli

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగితే వ్యూయర్‌షిప్ రియల్ టైం రికార్డులు లేచి పోవడం పక్కా అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories