కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ పెట్టి పొగిడితే అంతే... సాహా, యశస్వి జైస్వాల్, సూర్యలపై ఎఫెక్ట్, శుబ్‌మన్ గిల్ కూడా...

Published : May 17, 2023, 03:59 PM ISTUpdated : May 17, 2023, 04:03 PM IST

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో టన్నుల కొద్దీ పరుగులు చేసే ఈ బ్యాటర్‌కి బ్యాడ్‌ లక్ బాగా క్లోజ్. 16 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్, ఈసారి ప్రతీ మ్యాచ్‌ని ఆసక్తిగా వీక్షిస్తున్నాడు...  

PREV
19
కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ పెట్టి పొగిడితే అంతే... సాహా, యశస్వి జైస్వాల్, సూర్యలపై ఎఫెక్ట్, శుబ్‌మన్ గిల్ కూడా...
Image credit: PTI

ఐపీఎల్ 2023లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, ఇన్‌స్టా స్టోరీల ద్వారా దాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నుంచి బాగా ఆడిన ప్లేయర్లను పొడుగుతూ ఇన్‌స్టా స్టోరీలు పెట్టడం మొదలెట్టాడు కోహ్లీ...
 

29

దానికి ముందు లక్నోతో మ్యాచ్‌లో నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌లతో గొడవ కావడం... ఆ తర్వాత విరాట్ ఇలా స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
 

39

లక్నోతో మ్యాచ్‌లో 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాని పొడుగుతూ ‘వాట్ ఏ ప్లేయర్’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు విరాట్ కోహ్లీ.. 

49
PTI Photo) (PTI05_07_2023_000160B)

ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 2 పరుగులు చేసి అవుటైన సాహా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కోహ్లీ స్టోరీ పెట్టి పొడగకముందు కూడా సాహా ఫామ్ పెద్దగా గొప్పగా ఏమీ లేదు.. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్..

59
Yashasvi Jaiswal

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన యశస్వి జైస్వాల్‌ని పొడుగుతూ ‘వావ్... ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇది. వాట్ ఏ టాలెంట్. స్టార్ యశస్వి జైస్వాల్’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ... ఆ తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు..

69

ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న యశస్వి జైస్వాల్ డకౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకే ఆలౌట్ అయ్యి, చిత్తుగా ఓడింది. కోహ్లీ పవర్, ఆర్‌సీబీకి ఈ విషయంలో బాగానే కలిసి వచ్చింది.. 

79
Image credit: PTI

ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్‌ని పొడుగుతూ ‘తులా మన్లా బవూ’ (మరాఠీలో హ్యాట్సాఫ్ యూ బ్రదర్) అంటూ స్టోరీ పెట్టాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాతి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
 

89
Shubman Gill

దీంతో ఇప్పుడు అందరి దృష్టి శుబ్‌మన్ గిల్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసి, ఐపీఎల్‌లో మొదటి సెంచరీ బాదాడు గిల్.

99

గిల్‌ని పొడుగుతూ ‘ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ గిల్ చెలరేగిపోతాడు. తర్వాతి తరాన్ని నడిపించు.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ స్టోరీ పెట్టాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ డకౌట్ అవుతాడంటూ ఇన్‌స్టాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. 

Read more Photos on
click me!

Recommended Stories