నాన్న ఇది నీ కోసం... మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌ చేస్తుంటే దండం పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్..

Published : May 17, 2023, 04:28 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ని ఎలాంటి అంచనాలు లేకుండా ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్, ఊహించని విధంగా టాప్ 3లోకి దూసుకొచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 257 పరుగులు చేసి, రెండో హైయెస్ట్ బాదిన లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కేతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో వచ్చిన పాయింట్‌తో గేమ్ ఛేంజర్‌గా మారింది..

PREV
18
నాన్న ఇది నీ కోసం... మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌ చేస్తుంటే దండం పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్..
Image credit: PTI

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ప్రస్తుతం 15 పాయింట్లతో టాప్ 3లో ఉన్న లక్నో, ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి..

28
Image credit: PTI

178 పరుగుల లక్ష్యఛేదనలో 19 ఓవర్లలో 167 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఆ ఓవర్‌లో 11 పరుగులు చేస్తే ముంబై గెలుస్తుందగా బౌలింగ్‌కి వచ్చిన మోహ్సిన్ ఖాన్, అదిరిపోయే బౌలింగ్‌తో కేవలం 5 పరుగులే ఇచ్చాడు. టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నా, చివరి ఓవర్‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు..

38
Mohsin Khan

మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌కి వచ్చినప్పుడు డగౌట్‌లో కూర్చొన్న లక్నో సూపర్ జెయింట్స్ యజమాని రాజీవ్ గోయింకా, చేతిలో ఓ ఫోటో తీసుకుని దండం పెట్టుకోవడం కనిపించింది. దీనికి కారణం ఈ మ్యాచ్‌లో ఓడితే లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. అయితే మోహ్సిన్ ఖాన్‌, అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్నోకి సూపర్ విక్టరీ అందించాడు.

48
Mohsin Khan

గత సీజన్‌లో అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో లక్నో ప్లేఆఫ్స్ చేరడానికి కారణమైన మోహ్సిన్ ఖాన్, కొన్నాళ్లుగా గాయంతో బాధపడుతున్నాడు. గత ఏడాది ఐపీఎల్ తర్వాత మోహ్సిన్ ఖాన్‌, అక్టోబర్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అతని మోచేతికి శస్త్ర చికిత్స కూడా జరిగింది..

58

ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగానే ఐపీఎల్ 2023 సీజన్‌లో చాలా మ్యాచులకు మోహ్సిన్ ఖాన్ దూరంగా ఉన్నాడు. అదీకాకుండా మోహ్సిన్ ఖాన్ తండ్రి ముల్తాన్ ఖాన్, 10 రోజులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు..

68
lsg dugout

‘నేను ప్రాక్టీస్ చేసిన దాన్ని పక్కాగా అమలు చేశా. కృనాల్ నాతో మాట్లాడేటప్పుడు కూడా ఇదే చెప్పా. టెన్షన్ పడకు, నేను చూసుకుంటా అని చెప్పా. ఆఖరి ఓవర్‌ అని టెన్షన్ పడలేదు, రన్ అప్ మార్చలేదు... స్కోరు బోర్డును చూడకుండా బౌలింగ్ చేశాను..

78

గత ఏడాదిగా కఠినమైన పరిస్థితులను ఫేస్ చేశాను. గాయపడి, ఏడాది తర్వాత ఆడుతున్నా. నిన్న మా నాన్న ఐసీయూ నుంచి డిశార్జి అయ్యారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన ఈ మ్యాచ్ చూస్తున్నారనే అనుకుంటున్నా.. నాన్న ఇది నీ కోసం..’ అంటూ ఎమోషనల్ అయ్యాడు మోహ్సిన్ ఖాన్.. 

88

మిచెల్ స్టార్క్ స్టైల్ బౌలింగ్‌తో అదరగొట్టే మోహ్సిన్ ఖాన్, ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 5.97 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఈ పర్ఫామెన్స్ తర్వాత టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఊహించినా గాయపడడంతో సెలక్టర్లు అతన్ని పక్కనబెట్టారు. 

click me!

Recommended Stories