ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఇలా కూడా వాడొచ్చా! అవుటైన బ్యాటర్ ప్లేస్‌లో కృష్ణప్ప గౌతమ్‌ని దింపిన లక్నో...

First Published Apr 1, 2023, 10:47 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఇంపాక్ట్ ప్లేయర్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తుషార్ దేశ్‌పాండేనే, చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచాడు. గుజరాత్ టైటాన్స్‌‌కి ఈ రూల్ బాగానే కలిసి వచ్చినా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు..

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అప్పటికే బౌలింగ్ పూర్తి చేసుకున్న ఖలీల్ అహ్మద్ ప్లేస్‌లో ఆమన్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.. ఆఖరి ఓవర్‌లో తీసుకొచ్చి అతనితో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ మాత్రమే చేయించింది ఢిల్లీ క్యాపిటల్స్...
 

Image: PTI

అయితే లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించింది. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన ఆయుష్ బదోనీ, 20వ ఓవర్ ఐదో బంతికి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదోనీ అవుట్ కాగానే అతని స్థానంలోనే కృష్ణప్ప గౌతమ్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చింది లక్నో...
 

Image: PTI

అంటే అవుటైన ప్లేయర్ ప్లేయర్‌లో మరో బ్యాటర్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే కృష్ణప్ప గౌతమ్ సిక్సర్ బాదాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఇలా కూడా వాడొచ్చా? అనే విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అవుటైన ప్లేయర్ ప్లేస్‌లో అదే ఇన్నింగ్స్‌లో మరో ప్లేయర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావడం అంటే 12 మందిని బ్యాటింగ్ చేయించడం లాంటిదే... అవుటైన ప్లేయర్‌కే మళ్లీ బ్యాట్ ఇచ్చి ఆడించడం వంటిదిది.. లో స్కోరింగ్ గేమ్స్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, వివాదాస్పదం అయినా కావచ్చు.. 

ఇంపాక్ట్ ప్లేయర్ కూడా కంకూషన్ సబ్‌స్టిట్యూట్ లాంటిదే అనుకున్నారు చాలామంది... కంకూషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ ప్రకారం అయితే గాయపడిన ఆటగాడి ప్లేస్‌లో (ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత) మరో ప్లేయర్‌ని ఆడించే అవకాశం ఉంటుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ విధానంలో గాయపడకపోయినా టీమ్‌లో తీసుకురావచ్చని అనుకున్నారు.. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అలా కాదని, దీని వల్ల టీమ్‌కి చాలా అడ్వాంటేజ్ ఉందని లక్నో వాడిన విధానం ద్వారా క్రికెట్ అభిమానులకు తెలిసింది.. 

ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఈ రేంజ్‌లో వాడడానికి కారణం లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. బిగ్ బాష్ లీగ్‌లో ఎన్నో ఫ్రాంఛైజీలకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్‌‌కి ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఎలా వాడాలో బాగా తెలుసు. అక్కడి మెలకువలను ఇక్కడ అమలు చేసి, తన ‘ఇంపాక్ట్’ చూపించాడు ఆండీ ఫ్లవర్...

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలోనే మంచి కిక్ ఇచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, మున్ముందు ఎలాంటి చిత్రవిచిత్రాలను చూపిస్తుందో... లక్నో వాడినట్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడి, మ్యాచ్ రిజల్ట్‌ని మార్చే మేధావులు ఎవరు అవుతారో చూడాలి..

click me!