ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఐపీఎల్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ, భారత ప్రభుత్వానికి కడుతున్న ట్యాక్స్ తెలుసా? సున్నా... అవును! బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వస్తున్న వేల కోట్ల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది...
ఐపీఎల్‌కి వస్తున్న ఆదాయాన్ని అనేక మార్గాల్లో ఆర్జిస్తోంది. 2008 నుంచి 2017 వరకూ ఐపీఎల్‌కి బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న సోనీ మ్యాక్స్, రూ.8200 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత 2017 నుంచి 2022 వరకూ ఐపీఎల్‌ను ప్రసారం చేసిన డీస్నీ ప్లస్ హాట్ సట్ార్ రూ.16,348 కోట్లు చెల్లించింది..
27
Image credit: Sandeep Rana
ఐపీఎల్ 2023-27 సీజన్ల బ్రాడ్ కాస్టింగ్ హక్కుల విక్రయం ద్వారా రూ.48,390.5 కోట్లు ఆర్జించింది బీసీసీఐ. టీవీ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ రూ.23,575 కోట్లు చెల్లిస్తుంటే, డిజిటల్ స్టీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న వయాకాం నెట్‌వర్క్ రూ.23,750 కోట్లు చెల్లించనుంది. విదేశాల్లో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం రూ.1058 కోట్లు చెల్లించింది వయాకాం, టైమ్స్ నెట్‌వర్క్..
37
Image credit: Sandeep Rana
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ద్వారా రూ.107.5 కోట్లు ఆర్జించనుంది బీసీసీఐ. ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డుకి వచ్చే సంపాదన ఇక్కడితో ఆగలేదు. టైటిల్ స్పాన్సర్‌గా టాటా, బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. అయితే అఫిషియల్ కిట్ స్పాన్సర్స్ డ్రీమ్ 11, క్రెడ్ అండ్ కో రూ.210 కోట్లు చెల్లిస్తున్నారు..
47
Image credit: Sandeep Rana
అంపైర్లు పెట్టుకునే క్యాప్ మీద ఉండే పేటీఎం, బీసీసీఐకి ఏడాదికి రూ.28 కోట్లు కడుతోంది. స్ట్రాటెజిక్ టైం అవుట్ సమయంలో ‘సియట్’ అని కనిపించినందుకు ‘CEAT’ సంస్థ, బీసీసీఐకి రూ.30 కోట్లు చెల్లిస్తోంది. కేవలం స్పాన్నర్ల ద్వారానే 708 కోట్ల రూపాయలు, బీసీసీఐ ఖజానాలో చేరుతున్నాయి..
57
Image credit: Sandeep Rana
ఇది ఇక్కడితో ఆగలేదు. ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచులు దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో జరగబోతున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో బీసీసీఐకి కూడా వాటా ఉంటుంది.
67
Image credit: Sandeep Rana
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీల విక్రయం ద్వారా రూ.12,715 కోట్లు ( గుజరాత్ టైటాన్స్ రూ.5,625 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్‌ని రూ.7090 కోట్లు) బీసీసీఐ ఖాతాలో చేరాయి. కొత్త ఫ్రాంఛైజీల బిడ్డింగ్ నామినేషన్ల కోసం కూడా కోట్ల రూపాయలను కంపెనీల నుంచి వసూలు చేసింది బీసీసీఐ...
77
Image credit: Sandeep Rana
ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. దేశంలో క్రీడాభివృద్ధికి, మారుమూల గ్రామాలకు క్రికెట్‌కి చేరువ చేస్తుందనే ఉద్దేశంతో ఐపీఎల్‌కి ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబునల్ (ITAT) కింద ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది కేంద్రం...