ఒక్క ఐపీఎల్ మ్యాచ్ సరిగా పెట్టలేరు! మీకు వరల్డ్ కప్ మ్యాచులు కావాలా.. మొహాలీ స్టేడియంలో...

Published : Apr 01, 2023, 08:24 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా మొదలైంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో చెన్నై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎలాంటి ఆటంకం, అవాంతరాలు లేకుండా ముగిసింది. అయితే రెండో మ్యాచ్‌ అలా జరగలేదు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌... సాంకేతిక కారణాలతో అరగంటకు పైగా ఆగిపోయింది...  

PREV
16
ఒక్క ఐపీఎల్ మ్యాచ్ సరిగా పెట్టలేరు! మీకు వరల్డ్ కప్ మ్యాచులు కావాలా.. మొహాలీ స్టేడియంలో...
(PTI Photo/Kamal Kishore) (PTI04_01_2023_000136B)

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భనుక రాజపక్ష 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ప్రభుసిమ్రాన్ 23, జితేశ్ శర్మ 21, సికందర్ రజా 16, సామ్ కుర్రాన్ 26 పరుగులు చేశారు..

26

అయితే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మొదలుకాలేదు. టెక్నికల్ కారణాలతో స్టేడియంలోని సగం ఫ్లడ్ లైట్స్ వెలగలేదు. దీంతో దాదాపు అరగంటకు పైగా ఆట నిలిచిపోయింది. ఓ రకంగా ఆటకు వచ్చిన ఈ బ్రేక్ కారణంగానే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి డీఎల్‌ఎస్ విధానం వాడాల్సి వచ్చింది...
 

36
(PTI Photo/Kamal Kishore)(PTI04_01_2023_000164B)

కేకేఆర్ ఇన్నింగ్స్ సమయానికి మొదలై ఉండి ఉంటే, వర్షం మొదలయ్యే సమయానికి మ్యాచ్ ముగిసిపోయి ఉండేది. వర్షం కురిసే సమయానికి కేకేఆర్ 16 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో విలువైన సమయం వృధా కాకపోయి ఉంటే.. చినుకులు రాకముందే రిజల్ట్ తేలిపోయి ఉండేది..

46

గుజరాత్‌లో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని మెరుగులు దిద్ది, వరల్డ్‌లో బిగ్గెస్ట్ స్టేడియంగా మార్చిన ప్రభుత్వం.. పంజాబ్‌లో మొహాలీ స్టేడియాన్ని పట్టించుకోవడం లేదు. కేకేఆర్ కూడా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌ని ట్రోల్ చేస్తూ మీమ్స్ వేయడం విశేషం..

56
Mohali stadium

‘మొహాలీలో ఫ్లడ్ లైట్స్‌ పనిచేయడం లేదు. రిపేర్ చేయడానికి పెద్ద గన్స్‌ని పిలుస్తున్నాం..’ అంటూ కేకేఆర్ సహా యజమాని షారుక్ ఖాన్‌ వీడియో క్లిప్‌ని పోస్ట్ చేసింది కోల్‌కత్తా. ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో కూడా వరల్డ్ కప్ మ్యాచులు జరిగే అవకాశం ఉంది..

66
Image credit: PTI

ఐపీఎల్ మ్యాచ్‌లో టెక్నికల్ అంతరాయం కలిగితే ఓకే కానీ వరల్డ్ కప్‌లో ఇలాంటి సంఘటనలు జరిగితే భారత్‌ పరువు పోతుంది. ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తానని హామీలు ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వం, కనీసం స్టేడియంలో ఫ్లడ్ లైట్స్‌ని పట్టించుకోవడం లేదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..

click me!

Recommended Stories