లాస్ట్ సీజన్‌లో ఆర్‌సీబీకి మేం సాయం చేశాం! ఈసారి వాళ్లు చేస్తే.. - ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...

Published : May 21, 2023, 08:40 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ చేరలేకపోయింది, 2022 సీజన్‌లో అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 14 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని 10 పరాజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది...

PREV
18
లాస్ట్ సీజన్‌లో ఆర్‌సీబీకి మేం సాయం చేశాం! ఈసారి వాళ్లు చేస్తే.. - ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...
Image credit: PTI

2023 సీజన్‌ని కూడా పెద్దగా అంచనాలు లేకుండా ఆరంభించింది ముంబై ఇండియన్స్. జస్ప్రిత్ బుమ్రా గాయంతో సీజన్‌ నుంచి దూరం కావడం, జోఫ్రా ఆర్చర్ సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతుండడంతో ముంబై ఇండియన్స్‌పై పెద్దగా అంచనాలు లేవు. అనుకున్నట్టే 8  మ్యాచుల్లో 4 విజయాలే అందుకుంది...
 

28

టీమ్‌లో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఒక్క భారత ఫాస్ట్ బౌలర్ లేకపోయినా బ్యాటింగ్ బలంతోనే వరుస విజయాలు అందుకుంటూ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది ముంబై ఇండియన్స్.. గట్టిగా చెప్పాలంటే ఆకాశ్ మద్వాల్, నేహాల్ వదేరా, కుమార్ కార్తికేయ వంటి బేస్ ప్రైజ్ బౌలర్లతోనే ముంబై విజయాలు అందుకుంది..

38

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఆర్‌సీబీ ఓడిపోవాలి. ఎందుకంటే 16 పాయింట్లతో ఉన్న ముంబై నెట్ రన్ రేట్ మైనస్‌ల్లో ఉంది...

48
Rohit Sharma

‘ఏం జరిగినా నిరుత్సాహపడకూడదనే మైండ్‌సెట్‌తోనే నేటి మ్యాచ్‌ ఆడేందుకు వచ్చాం. మా చేతుల్లో ఉన్నదాంట్లో నియంత్రించగలం, లేనిదాన్ని కంట్రోల్ చేయలేం కదా.. నా ఫామ్‌ గురించి నాకు చింతలేదు, నేనెవరితో మాట్లాడలేదు కూడా...

58
Virat Kohli-Rohit Sharma

గత ఏడాది మేం ఆర్‌సీబీకి సాయం చేశాం. ఈసారి వాళ్లు మాకు కావాల్సిన రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాం. ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించకపోయినా వరుసగా మూడు విజయాలు అందుకున్నాం...

68

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయలేక ఓడిపోయాం. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌ కూడా ఆఖరి దాకా మా చేతుల్లోనే ఉంది. అయితే గెలవలేకపోయాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద నష్టం చేశాయి..

78

ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించి అనవసరం. కొన్నిసార్లు ఏం చేసినా వర్కవుట్ కాదు, రోజు మనది కాదని అలా వదిలేయాలంతే...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. 
 

88

2023 సీజన్‌లో ఆఖరి పొజిషన్‌లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరింది. 

 

click me!

Recommended Stories