క్వాలిఫైయర్‌కి ముందు రవీంద్ర జడేజా ‘కర్మ’ ట్వీట్... ఏం జరిగింది? ధోనీ ఫ్యాన్స్‌తో పడలేక...

First Published May 21, 2023, 6:48 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 77 పరుగుల భారీ తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్‌‌కి అర్హత సాధించింది. 17 పాయింట్లతో మొదటి క్వాలిఫైయర్‌కి అర్హత సాధించింది.
 

ఈ మ్యాచ్ తర్వాత ‘కర్మ తప్పక తిరిగి వస్తుంది, త్వరలో లేదా కాస్త ఆలస్యం కావచ్చు. రావడం మాత్రం పక్కా..’ అంటూ కర్మ ట్వీట్ చేశాడు రవీంద్ర జడేజా. సాధారణంగా సీఎస్‌కే మ్యాచులు గెలిచిన తర్వాత ఆ మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడం చేస్తుంటాడు జడ్డూ...

Latest Videos


jadeja

అయితే మొదటి క్వాలిఫైయర్‌కి అర్హత సాధించిన తర్వాత ఇలా కర్మ ట్వీట్ ఎందుకు చేశాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, బ్యాటుతో 153 పరుగులు చేశాడు. 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_06_2023_000205B)

అయితే ధోనీ ఫ్యాన్స్ కారణంగా జడేజాకి ఈ సీజన్‌లో నిరాశ తప్పలేదు. రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నా సరే, అవుట్ అవ్వాలని సొంత సీఎస్‌కే ఫ్యాన్స్ కోరుకున్నారు. ఢిల్లీతో మ్యాచ్‌లో కూడా ధోనీ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా 7 బంతుల్లో 20 పరుగులు చేస్తే, ధోనీ 4 బంతుల్లో 5 పరుగులే చేశాడు. 

PTI PhotoR Senthil Kumar)(PTI04_30_2023_000246B)

ధోనీకి స్ట్రైయిక్ ఇవ్వకుండా జడేజా బౌండరీలు బాదడాన్ని మాహీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. జడ్డూని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జడేజాకి కోపం రావడానికి ఇదే కారణమని కొందరు అనుమానిస్తున్నారు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ, జడేజా మధ్య ఓ సుదీర్ఘ చర్చ జరిగింది. జడ్డూ ఏ విషయం మీదో అసంతృప్తి వ్యక్తం చేస్తే, మాహీ అతనికి వివరిస్తూ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే వారిద్దరి మధ్య దేని గురించి చర్చ జరిగింది, జడేజాకి ఎందుకు కోపమొచ్చిందనే విషయాలు మాత్రం తెలీదు..
 

Image credit: PTI

గత సీజన్‌ ఆరంభానికి ముందు ధోనీ, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. జడేజా సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. సీజన్‌లో 8 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న తర్వాత జడ్డూ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, తిరిగి ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి...

జడేజాని కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సంఘటన తర్వాత సీఎస్‌కే, జడేజాని అన్‌ఫాలో చేయడం, జడ్డూ చెన్నై సూపర్ కింగ్స్‌కి సంబంధించిన ఫోటోలు, ట్వీట్లు, కామెంట్లు డిలీట్ చేయడం జరిగిపోయాయి..

Image credit: PTI

జడేజా, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడేందుకు ఇష్టం పడడం లేదని కూడా అతని సన్నిహితులు తెలిపారు. అయితే 2023 సీజన్ ఆరంభంలో ధోనీ, జడేజాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే 2023 సీజన్‌లో జరుగుతున్న పరిణామాలు, జడేజాకి కోపం తెప్పిస్తున్నాయని అంటున్నారు అతని ఫ్యాన్స్.. 

PTI PhotoR Senthil Kumar) (PTI04_21_2023_000312B)

15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న తనను, ఓ యంగ్ ప్లేయర్‌కి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వకుండా సీఎస్‌కే ఫ్యాన్స్ అవమానించడాన్ని తట్టుకోలేక ‘కర్మ’ ట్వీట్ చేశాడని అంటున్నారు నెటిజన్లు...

PTI PhotoKunal Patil)(PTI04_08_2023_000287B)

రవీంద్ర జడేజా ట్వీట్‌కి ఆయన భార్య రివాబా జడేజా... ‘ఫాలో యువర్ ఓన్ పాత్’ (నీ సొంత దారిని అనుసరించు) అంటూ  రిప్లై ఇచ్చింది. ఈ రిప్లైతో జడ్డూ ట్వీట్, ధోనీ గురించి ఇన్‌డైరెక్ట్‌గా వేసిందేనని అంటున్నారు ఫ్యాన్స్.. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. సీఎస్‌కే బౌలర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ జడ్డూయే. 

click me!