లాస్ట్ పొజిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్... మూడేళ్లలో రెండోసారి! ఎలా ఉండే టీమ్‌ని, ఎలా చేశార్రా...

Published : May 21, 2023, 07:41 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని అంచనా వేశారు ఆకాశ్ చోప్రా వంటి మాజీలు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే  14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... 10 పరాజయాలతో 10వ స్థానంలో 2023 సీజన్‌ని ముగించింది..

PREV
19
లాస్ట్ పొజిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్...  మూడేళ్లలో రెండోసారి! ఎలా ఉండే టీమ్‌ని, ఎలా చేశార్రా...
Image credit: PTI

వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి టీమ్ కూడా. ఢిల్లీ ఈసారి ఆఖరి పొజిషన్‌లో నిలవడం ఖాయమనుకున్నారంతా... అయితే డేవిడ్ వార్నర్ భాయ్ టీమ్‌కి ఆ అవకాశం ఇవ్వమని, సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చివరి ప్లేస్‌లో నిలిచింది..

29
Image credit: PTI

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుని అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో మళ్లీ ఆఖరి పొజిషన్‌లోకి తిరిగి వచ్చేసింది...
 

39
Image credit: PTI

గత మూడు సీజన్లలో టాప్ 8 కూడా దాటని టీమ్ ఏదైనా ఉందంటే అది మన ఆరెంజ్ ఆర్మీయే. అంతేకాదు ఈసారి ఆరెంజ్ ఆర్మీ మరో ఘనత కూడా సాధించింది. 2023 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ప్రత్యర్థికి మూడు సెంచరీలు అప్పగించేశారు మన బౌలర్లు..

49

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సెంచరీ చేయగా, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లో లేని కామెరూన్ గ్రీన్ కూడా సెంచరీ బాదేశాడు...
 

59

2018 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ రికార్డును ఐదేళ్ల తర్వాత మళ్లీ తానే బ్రేక్ చేసింది. 2015 నుంచి 200+ స్కోరు చేసిన మ్యాచుల్లో ఎప్పుడూ ఓడని సన్‌రైజర్స్ హైదరాబాద్, నేటి మ్యాచ్‌లో ఆ రికార్డును కూడా పోగొట్టుకుంది.. 

69
Image credit: PTI

2016లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన తర్వాత వరుసగా ఐదు సీజన్లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2018లో రన్నరప్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, 2017, 2020 సీజన్లలో రెండో క్వాలిఫైయర్ మ్యాచులు ఆడింది..

79
srh vs lsg

2021లో డేవిడ్ వార్నర్‌తో గొడవ దగ్గర్నుంచి టీమ్‌కి దరిద్రం పట్టుకుంది. టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్,  ఇప్పుడు  స్టార్ ప్లేయర్లు ఉన్నా పర్ఫామెన్స్ ఇవ్వలేని చెత్త టీమ్స్‌లో ఒకటిగా మారింది.. 

89

మూడు సీజన్ల కింద సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ టీమ్స్ కూడా భయపడేవి, జాగ్రత్త పడేవి. 120 కొట్టినా ఆ స్కోరుని కట్టడి చేయగల బౌలింగ్ యూనిట్, సన్‌రైజర్స్‌కి ఉండేది.. 

99

ఇప్పుడు ఏ టీమ్ అయినా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటే ఈజీగా 2 పాయింట్లు వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోతున్నాయి. వాళ్లే కాదు, టీమ్ పర్పామెన్స్ చూసి ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయ్యారంటే ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.. 

click me!

Recommended Stories