ఆ నో బాల్ వచ్చి ఉంటే మ్యాచ్ రిజల్టే మారిపోయేది... సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్..

Published : May 14, 2023, 02:47 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని చూశారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. సౌతాఫ్రికా20 టైటిల్ గెలిచిన అయిడిన్ మార్క్‌రమ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి..

PREV
17
ఆ నో బాల్ వచ్చి ఉంటే మ్యాచ్ రిజల్టే మారిపోయేది... సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్..
(PTI Photo)(PTI04_23_2023_000291B)

ఐపీఎల్ 2023 సీజన్‌ని రెండు ఓటములతో ప్రారంభించినా ఆ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే మనోళ్లు బాగా ఆడుతున్నారనే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషించేలోపు వరుస పరాజయాలు ఎదురయ్యాయి...

27
Aiden Markram

మూడో క్వార్టర్ ముగిసేలోపు 11 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకుని, ఆఖరి స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడే పరిస్థితిలో పడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
 

37

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ గెలిచేలా కనిపించినా.. అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్ మ్యాచ్‌ని ములుపు తిప్పేసింది..

47

‘180+ స్కోరు చేస్తే గెలవచ్చని అనుకున్నాం. మేం బ్యాటింగ్ బాగానే చేశాం. అయితే సరిగ్గా ఒక్క భాగస్వామ్యం నిర్మించి ఉంటే ఈజీగా 200 ప్లస్ స్కోరు చేసేవాళ్లం..

57

మ్యాచ్ ఆరంభం నుంచి వికెట్ స్లోగానే అనిపించింది. అయితే ఆ తర్వాత అన్యూహ్యంగా బ్యాటర్లకు అనుకూలించడం మొదలెట్టింది. ప్రెషర్‌ మ్యాచ్‌ విజయంలో కీ రోల్ పోషిస్తుంది..

67
srh vs lsg

నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ ఆ ప్రెషర్‌ని బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని నిర్ణయాలు మా టీమ్‌‌పై ప్రభావం చూపించాయి. 

77

ఆ నో బాల్‌ రివర్స్ చేయకపోయి ఫ్రీ హిట్ దొరికేది, మరో ఎక్స్‌ట్రా బాల్ వచ్చేది.. అదే జరిగి ఉంటే మరిన్ని పరుగులు వచ్చి ఉండేవి. మా విజయావకాశాలు పెరిగేవి..’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్.. 

click me!

Recommended Stories