కేజీఎఫ్ దాటేశారు, అయితే ఇలాంటి బౌలింగ్‌తో ఎప్పటికీ టైటిల్ గెలవలేరు... ఆర్‌సీబీపై ఆకాశ్ చోప్రా...

Published : May 14, 2023, 12:52 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడింది కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్ మాత్రమే. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు...  

PREV
17
కేజీఎఫ్ దాటేశారు, అయితే ఇలాంటి బౌలింగ్‌తో ఎప్పటికీ టైటిల్ గెలవలేరు... ఆర్‌సీబీపై ఆకాశ్ చోప్రా...

కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్...  ముగ్గురూ కలిసి 1400 పరుగులు చేస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన బ్యాటర్లు అందరూ కలిపి కూడా 600 పరుగులు చేయలేకపోవడం ఆ టీమ్ పర్పామెన్స్‌కి పర్ఫెక్ట్ నిదర్శనం...

27

అయితే గత రెండు మూడు మ్యాచులుగా పరిస్థితి కాస్త మారింది. మిడిల్ ఆర్డర్‌లో మహిపాల్ లోమ్రోర్‌, దినేశ్ కార్తీక్ కూడా కాస్త బ్యాటు ఝులిపించడం మొదలెట్టారు.. అయితే బౌలింగ్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు...

37

200లకు పైగా పరుగులు చేసినా కూడా ఆ లక్ష్యాన్ని ఈజీగా సమర్పించేస్తూ గెలిచే మ్యాచుల్లో కూడా ఓడుతూ వస్తోంది ఆర్‌సీబీ. 11 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచి తీరాల్సిందే..

47

‘కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్, ఫాఫ్) బాగా ఆడుతున్నారు. ఆ ముగ్గురూ అదరగొడుతున్నారు. కొన్ని మ్యాచులుగా మిడిల్ ఆర్డర్‌లో కూడా పరుగులు వస్తున్నాయి. బ్యాటింగ్‌లో ఆర్‌సీబీకి పెద్ద లోపాలు కనిపించడం లేదు..

57
(PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000254B)

అయితే బౌలింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నో సీజన్లుగా ఆర్‌సీబీ బౌలింగ్ చూస్తూ వస్తున్నాం. సీజన్లు మారుతున్నా వారి బౌలింగ్ మాత్రం మారడం లేదు. కర్ణ్ శర్మ, వానిందు హసరంగ, జోష్ హజల్‌వుల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్... అందరూ పరుగులు ఇచ్చేస్తున్నారు...

67
Mohammed Siraj

ఇలాంటి బౌలింగ్ యూనిట్‌తో ఏ జట్టు కూడా టైటిల్ గెలవలేదు. టైటిల్ విజేతగా నిలవాలంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ యూనిట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

77

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, జోష్ హజల్‌వుల్, హర్షల్ పటేల్ కలిసి 9.3 ఓవర్లు బౌలింగ్ చేసి 104 పరుగులు ఇచ్చేశారు. ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సిరాజ్ కూడా జోష్ హజల్‌వుడ్ వచ్చాక గతి తప్పాడు..

click me!

Recommended Stories