8 ఓవర్లలో 80 కొట్టాక, ఇంత చెత్తగా ఓడిపోయాం! ఇలాంటి టీమ్‌తో ఎలా ఆడేది... - డేవిడ్ వార్నర్

Published : May 14, 2023, 01:11 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా తప్పుకుంది. మిణుకుమిణుకు మంటున్న ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో 31 పరుగుల తేడాతో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్...

PREV
18
8 ఓవర్లలో 80 కొట్టాక, ఇంత చెత్తగా ఓడిపోయాం! ఇలాంటి టీమ్‌తో ఎలా ఆడేది...  - డేవిడ్ వార్నర్

ఐపీఎల్ 2023 సీజన్‌ని వరుసగా ఐదు పరాజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని, ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఆ జోరును కొనసాగించడంలో వార్నర్ టీమ్ విఫలమైంది..

28
PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000485B)

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 182 పరుగులను ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సరిగ్గా 168 పరుగుల లక్ష్యాన్ని కొట్టలేక చేతులు ఎత్తేసింది...

38

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కి 6.1 ఓవర్లలో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కూడా ఢిల్లీ క్యాపిటల్స్... 31 పరుగుల తేడాతో ఓడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

48

27 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్ప టాపార్డర్, మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మిచెల్ మార్ష్ 3, రిలే రసో 5, అక్షర్ పటేల్ 1 పరుగు చేసి అవుట్ కాగా మనీశ్ పాండే డకౌట్ అయ్యాడు..

58

‘అలాంటి ఓపెనింగ్ దక్కిన తర్వాత ఇలాంటి ఓటమి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇలా ఆడితే ఎప్పుడూ మ్యాచులు గెలవలేం. మాకు మంచి ఆరంభం దక్కింది. అయితే దాన్ని వాడుకోవడంలో బ్యాటర్లు విఫలమయ్యారు..
 

68

సీజన్ ప్రారంభంలో వరుసగా మ్యాచులు ఓడిపోయిన తర్వాత సరైన టీమ్ కాంబినేషన్‌ని సెట్ చేశామని అనుకున్నాం. అయితే మిడిల్ ఓవర్లలో 30 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోవడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది...

78
PTI Photo) (PTI05_02_2023_000393B)

బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా కొన్ని క్యాచ్‌లను డ్రాప్ చేశాం. ఇక మిగిలిన మ్యాచులు కేవలం పరువు కోసమే ఆడాలి. ఇకనైనా కాస్త ఫ్రీగా ఆడతారని ఆశిస్తున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

88

ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు ఆఖరి స్థానంలో నిలిచి చెత్త రికార్డు క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్ ఆడింది. 2021 సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరి, రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది. 2022 సీజన్‌లో నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్.. 

click me!

Recommended Stories