ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫస్టాఫ్‌లో 3 విజయాలు అందుకుంటే, అందులో రెండు ఆర్‌సీబీపై వచ్చాయి, ఓ మ్యాచ్ రింకూ సింగ్ మ్యాజిక్ వల్ల గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. అయితే ఓ విషయంలో మాత్రం కేకేఆర్ మిగిలిన టీమ్స్ కంటే భిన్నంగా ఉంది...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 8 మ్యాచులు ఆడితే, 8 రకాల టీమ్ కాంబినేషన్స్‌ని ట్రై చేసింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. గత రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చి హాఫ్ సెంచరీలు చేసిన జాసన్ రాయ్, వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో తిరిగి రెహ్మానుల్లా గుర్భాజ్‌ని తీసుకొచ్చింది కేకేఆర్...
28
భాగ్యనగరాన్ని అల్లకల్లోలం చేసిన వరుణుడు, ఐపీఎల్ మ్యాచులను కూడా వదల్లేదు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆట ప్రారంభం అయ్యే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పాటు చినుకులు మొదలయ్యాయి...
38
Shardul Thakur-Sharukh Khan
దీంతో 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది మ్యాచ్. రెహ్మానుల్లా గుర్బాజ్‌తో కలిసి నారాయణ్ జగదీశన్ ఓపెనింగ్‌కి వచ్చాడు. ఈ సీజన్‌లో ఇది ఐదో ఓపెనింగ్ జోడి...
48
మొదటి మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్ - రెహ్మానుల్లా గుర్భాజ్ ఓపెనింగ్ చేయగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్- గుర్భాజ్ ఓపెనింగ్ వచ్చారు. ఆ తర్వాత జాసన్ రాయ్ - లిటన్ దాస్, నారాయణ్ జగదీశన్- సునీల్ నరైన్, జాసన్ రాయ్- నారాయణ్ జగదీశన్ ఓపెనర్లుగా వచ్చారు...
58
Image credit: PTI
ఓపెనింగ్ జోడీలతో చేసిన ప్రయోగాలు సరిపోదన్నట్టుగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్‌కి పంపింది కేకేఆర్. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్, టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 4 బంతులాడి డకౌట్ అయ్యాడు..
68
ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్ టీమ్‌లో ఉన్న ప్రతీ ప్లేయర్‌కి కూడా కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, లిటన్ దాస్, కుల్వంత్ కెజ్రోలియా, మన్‌దీప్ సింగ్, అన్‌కుల్ రాయ్... ఇలా ఏ ప్లేయర్‌ని కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టని కేకేఆర్... ప్రతీ ప్లేయర్‌కి అవకాశం కల్పించింది...
78
క్రికెట్‌లో పాక్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. అలాగే వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కూడా అలాగే ఉంటాయి. ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ కథ అదే విధంగా ఉంది...
88
విజయాలు వచ్చినా, రాకపోయినా ప్రయోగాలు చేయడంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు షారుక్ ఖాన్ టీమ్. చూస్తుంటే కేకేఆర్ ఈ సీజన్‌లో ఆండ్రే రస్సెల్‌తో ఓపెనింగ్ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..