ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 2లో దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ గాయంతో బాధపడుతుండడంతో ఆర్‌సీబీకి 3 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు...
17 నెలల తర్వాత కెప్టెన్సీలోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ, 3 మ్యాచుల్లో 2 విజయాలు అందించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్, టాపార్డర్ వైఫల్యంతో 21 పరుగుల తేడాతో ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
27
Image credit: PTI
‘గత ఏడాది విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకుంటే బెటర్ అని చర్చించుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కెప్టెన్సీ భారం దిగిన తర్వాత ఆ ఎనర్జీ, ఎంజాయ్‌మెంట్ తిరిగి వచ్చినట్టైంది..
37
Image credit: PTI
పరుగులు వచ్చినా, రాకపోయినా మ్యాచ్‌ని ఎంజాయ్ చేయడం చాలా అవసరం. విరాట్ కెప్టెన్‌గా ఉంటే అదే చేస్తాడు. టీమ్‌లో ప్రతీ ఒక్కరూ మ్యాచ్‌లో లీనం అయ్యేలా, ఎంజాయ్ చేసేలా చేస్తాడు.
47
Image credit: PTI
గత ఏడాది రోహిత్ శర్మ గాయపడిన తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టుకి కెప్టెన్సీ చేయాల్సిందిగా విరాట్‌ని కోరాల్సింది... విరాట్ కోహ్లీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా టెస్టు కెప్టెన్.
57
Image credit: PTI
రాహుల్ ద్రావిడ్ అనుకుని ఉంటే, తిరిగి విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయొచ్చు. నేను ఆ పొజిషన్‌లో ఉండి ఉంటే, కచ్ఛితంగా అదే చేసేవాడిని. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్‌లో 2-1 లీడ్ తీసుకుంది...
67
రెగ్యూలర్ కెప్టెన్ గాయపడి, టీమ్‌లో లేనప్పుడు... ఆ సిరీస్‌లో భారత జట్టుకి ఆధిక్యం అందించిన విరాట్‌ని కెప్టెన్సీ చేయమని అడిగడంలో తప్పేముంది. ఇంగ్లాండ్‌ని ఇంగ్లాండ్‌లో ఎలా ఓడించాలో విరాట్‌కి బాగా తెలుసు.
77
ఆ ఐదో టెస్టుకి విరాట్ కెప్టెన్సీ చేసి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది... లార్డ్స్ టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ చూసినవాళ్లు ఎవ్వరైనా దీన్ని ఒప్పుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...