మళ్లీ పాత కథే! తీరు మార్చుకోని ఆర్‌సీబీ... కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా తప్పని ఓటమి...

Published : Apr 26, 2023, 11:11 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది...

PREV
19
మళ్లీ పాత కథే! తీరు మార్చుకోని ఆర్‌సీబీ...  కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా తప్పని ఓటమి...
Image credit: PTI

7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు చేసిన ఫాఫ్ డు ప్లిసిస్, సుయాశ్ శర్మ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన షాబజ్ అహ్మద్ కూడా సుయాశ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

29
Image credit: PTI

ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ...
 

39
Varun Chakravarthy

ఈ దశలో మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర రస్సెల్ పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...

49
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000184B)

37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ బాదాడు. రస్సెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, బౌండరీ లైన్ దగ్గర వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

59
PTI Photo/Swapan Mahapatra)(PTI04_14_2023_000342B)

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన సుయాశ్ ప్రభుదేశాయ్, రనౌట్ అయ్యాడు. 5 పరుగులు చేసిన వానిందు హసరంగ, రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికే ఆర్‌సీబీ విజయానికి 19 బంతుల్లో 49 పరుగులు కావాల్సి వచ్చాయి..

69
Image credit: PTI

18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ కావడంతో ఆర్‌సీబీ ఓటమి ఖరారైపోయింది... ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 35 పరుగులు కావాల్సి వచ్చాయి. వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్‌లో 13 పరుగులే రావడంతో ఆర్‌సీబీ, 21 పరుగుల తేడాతో ఓడింది. 

79
PTI Photo/Swapan Mahapatra)(PTI04_23_2023_000434B)

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, 200 పరుగుల భారీ స్కోరు చేసింది.    29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జాసన్ రాయ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు..

89
PTI04_26_2023_000370B)

నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆర్‌సీబీ ఫీల్డర్లు క్యాచ్ డ్రాపులు చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా.

99

21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నితీశ్ రాణా, వానిందు హసరంగ బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..  26 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, హసరంగ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.    రింకూ సింగ్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయగా డేవిడ్ వీజ్ 3 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసి కేకేఆర్ స్కోరు 200 దాటించారు.

click me!

Recommended Stories