అక్కడ రిటైర్ అవ్వండి, ఇక్కడ కోట్లు తీసుకోండి... ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఫ్యాన్సీ ఆఫర్!

First Published Apr 27, 2023, 5:08 PM IST

ఐపీఎల్ తర్వాత పీఎస్‌ఎల్, సీపీఎల్, సౌతాఫ్రికా20, మేజర్ క్రికెట్ లీగ్, ది హాండ్రెడ్, బీబీఎల్... ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్ రోజురోజుకీ వేల కోట్ల వ్యాపారంగా మారుతోంది. సౌదీ అరేబియాతో పాటు చైనా వంటి దేశాలు కూడా ఫ్రాంఛైజీ క్రికెట్ తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి...

ఐపీఎల్ 2023 సీజన్‌లో సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్, హారీ బ్రూక్ వంటి క్రికెటర్లపై కనక వర్షం కురిపించాయి ఫ్రాంఛైజీలు. ఒక్కో ప్లేయర్ల కోసం రూ.13-రూ.18 కోట్లకు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి...

ఐపీఎల్‌లో ఉన్న ఫ్రాంఛైజీలే సౌతాఫ్రికా20 లీగ్‌తో పాటు ఇంటర్నేషనల్ లీగ్20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి లీగుల్లో జట్లను సొంతం చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి ఫ్రాంఛైజీలకు, ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగుల్లో కూడా టీమ్స్ ఉన్నాయి..

Latest Videos


Image credit: PTI

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఆడే ఫాఫ్ డుప్లిసిస్, సౌతాఫ్రికా 20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడుతున్నాడు. దీంతో ఈ ప్లేయర్లు, అన్నీ లీగులకు అందుబాటులో ఉండేలా ఓ ఫ్యాన్సీ ఆఫర్‌ని తీసుకొచ్చాయట ఐపీఎల్  ఫ్రాంఛైజీలు...

Image credit: PTI

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసి, ఫ్రాంఛైజీల తరుపున 365 రోజులు ఆడేందుకు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందిగా ఐపీఎల్ టీమ్స్, ఆరుగురు ఇంగ్లాండ్ ప్లేయర్లను కోరాయని, ఇందుకోసం వారికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ చెల్లించేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి..

క్రికెట్‌లో ఇది కొత్తైనా, ఫుట్‌బాల్‌లో ఈ ఫ్రాంఛైజీ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఫిఫా వరల్డ్ కప్ వంటి టోర్నీల సమయంలోనే తమ టీమ్‌కి ఆడే ఫుట్‌బాల్ ప్లేయర్లు, మిగిలిన సమయంలో ఫుట్‌బాల్ క్లబ్స్ తరుపున ఆడతారు. క్రికెట్‌లో కూడా ఈ సంస్కృతి రానుంది..
 

Image credit: Getty

ఇప్పటికే ఫ్రాంఛైజీలకు పూర్తిగా అందుబాటులో ఉండేందుకు వీలుగా ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్ వంటి ప్లేయర్లు, న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నారు. మున్నుందు ఇలా దేశానికి ఆడడం కంటే ఫ్రాంఛైజీల తరుపున ఆడేందుకు ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్ల సంఖ్య విపరీతంగా పెరగనుంది...

అయితే ఇంగ్లాండ్ ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇచ్చిన ఆఫర్‌కి ఎలా స్పందించారు? ఇది నిజంగానే జరిగిందా? లేక సోషల్ మీడియాలో పుట్టిన వార్తా? అనే వివరాలు తేలాల్సి ఉంది. ఈ వార్త నిజమై, ఇంగ్లాండ్ ప్లేయర్లు, ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడేందుకు అంగీకరించి... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే మాత్రం ఆ నిర్ణయం... క్రికెట్ ప్రపంచాన్ని మలుపు తిప్పడం ఖాయం...
 

ఇప్పటికే టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎంతో మంది ప్లేయర్లు, ఫ్రాంఛైజీ క్రికెట్ వైపు దృష్టి మళ్లించవచ్చు. స్టార్ ప్లేయర్లు దూరమైతే, ఇంగ్లాండ్ టీమ్ వీక్ అయిపోతుంది. అదే జరిగితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.. 

click me!