థర్డ్ అంపైర్ కావాలనే అవుట్ ఇచ్చాడా? పంజాబ్ కింగ్స్ ఓడిపోయి ఉంటే, ధోనీ టీమ్‌ని ఆడుకునేవాళ్లే...

First Published Apr 30, 2023, 7:50 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ గత సీజన్ల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. 9 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, ప్రస్తుతం టాప్ 5లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి విజయం అందుకుంది శిఖర్ ధావన్ టీమ్...

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగుల స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 37, శివమ్ దూబే 28 పరుగులు చేయగా డివాన్ కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

PTI PhotoR Senthil Kumar)(PTI04_30_2023_000227B)

ఆఖరి ఓవర్‌‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ 4 బంతుల్లో 2 సిక్సర్లతో 13 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. ధోనీ సిక్సర్లతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా, మొదటి బంతికి సింగిల్ తీసి ఉంటే డివాన్ కాన్వే సెంచరీ పూర్తి చేసుకునేవాడని మరికొందరు వాదిస్తున్నారు..

Latest Videos


Image credit: PTI

ఈ లక్ష్యఛేదనలో కెప్టెన్ శిఖర్ ధావన్ 28, ప్రభుసిమ్రాన్ సింగ్ 42, అథర్వ టైడ్ 13, లియామ్ లివింగ్‌స్టోన్ 40 పరుగులు చేసి అవుట్ కాగా 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, 18వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికి పంజాబ్ కింగ్స్ విజయానికి 3 ఓవర్లలో 31 పరుగులే కావాలి...
 

liam livingston

పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలుస్తుందని అనుకుంటుండగా మ్యాచ్‌లో డ్రామా మొదలైంది. 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన జితేశ్ శర్మ, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర షేక్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ క్లియర్‌గానే అందుకున్నా, బ్యాలెన్స్ తప్పిన షేక్ రషీద్, జారిపడిపోయాడు. తిరిగి లేచే సమయంలో అతని కాలు, బౌండరీ లైన్‌కి తగిలినట్టు కామెంటేటర్లు క్లియర్‌గా చెప్పారు. అయితే టీవీ రిప్లైలో అతని కాలు, బౌండరీ లైన్‌కి తగిలిందా? లేదా? అనేది క్లియర్‌గా కనిపించలేదు..

Jitesh Sharma

సికందర్ రజా ఆఖరి బంతికి ఫోర్ బాదడంతో పంజాబ్ కింగ్స్ గెలిచి ఊపిరి పీల్చుకుంది కానీ లేదంటే ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసి ఉండేది. బౌండరీ లైన్‌కి కాలు తగలకపోయి ఉంటే షేక్ రషీద్, క్యాచ్ పట్టిన సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవాలి కదా? ఎందుకు అలా షాక్‌లో ఉండిపోయాడు.. కాలు తగలబట్టే అలా షాకై ఉండిపోయాడనేది చాలామంది చెబుతున్న లాజిక్...

ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక ఓడిపోయి ఉంటే మాత్రం మహేంద్ర సింగ్ ధోనీని, సీఎస్‌కేని ఓ లెవెల్‌లో ఆడుకునేవాళ్లు నెటిజన్లు. ఛీటింగ్ చేసి గెలిచిందని, చెన్నైలో అంపైర్లు ఇలాంటి నిర్ణయం ఇవ్వడంలో పెద్ద విచిత్రమేమీ లేదని ట్రోల్స్ చేసేవాళ్లు. పంజాబ్ గెలిచినా సోషల్ మీడియాలో ఈ తరహా మీమ్స్ ప్రత్యక్షం కావడం విశేషం..

click me!