రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన తర్వాత యశ్‌తో ఆ ఒక్క మాటే చెప్పా... - హార్ధిక్ పాండ్యా

Published : Apr 30, 2023, 06:38 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 40కి పైగా మ్యాచులు జరిగినా అందరికీ గుర్తుండిపోయింది మాత్రం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లతో విరుచుకుపడిన ఇన్నింగ్సే. ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు కావాల్సి రావడంతో టైటాన్స్ విజయం ఖాయమనుకున్నారంతా...

PREV
16
రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన తర్వాత యశ్‌తో ఆ ఒక్క మాటే చెప్పా... - హార్ధిక్ పాండ్యా

ఉమేశ్ యాదవ్ మొదటి బంతికి సింగిల్ తీయడంతో టైటాన్స్ కూడా ఇక గెలిచేశామని రిలాక్స్ అయిపోయింది. అయితే చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు రింకూ సింగ్... 

26

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన యశ్ దయాల్ ఆ తర్వాత ఇప్పటిదాకా ఇంకో మ్యాచ్ ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ అనారోగ్యానికి గురై, 7-8 కిలోల బరువు తగ్గాడని చెప్పిన హార్ధిక్ పాండ్యా, ఆ మ్యాచ్ తర్వాత టైటాన్స్ బౌలర్‌తో చెప్పిన మాటలను బయటపెట్టాడు...

36

‘ఆ మ్యాచ్‌ సమయంలో నాకు కాస్త బాలేకుండే. ఆ మ్యాచ్ తర్వాత విక్రమ్ సోలంకీ, గెట్ టు గెదర్ ప్లాన్ చేశాడు. మేం ఏ మ్యాచ్ ఓడిపోయినా ఆ తర్వాత ఓ గెట్ టుగెదర్ ఏర్పాలు చేయాలని గత సీజన్‌లో నిర్ణయించుకున్నాం.

46
Yash Dayal

నేను యశ్ దయాల్‌కి ఒకే మాట చెప్పాను. మనం ఏ వైపు ఉన్నా సరే, ఐపీఎల్ ఉన్నంతకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లో నువ్వు భాగస్వామివి అయ్యావ్. రింకూ సింగ్ ఇన్నింగ్స్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా నీ గురించి చెప్పుకుంటారు. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు..

56
yash dayal

ఆ మ్యాచ్‌లో ఓడిపోతామని ఎవ్వరం అనుకోలేదు, ఆఖరి ఓవర్‌కి వచ్చిన తర్వాత గెలుస్తామని కేకేఆర్ కూడా అనుకుని ఉండదు. అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. 

66

ఓ బౌలర్‌గా దాని గురించి ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది... అని చెప్పాను. అతను త్వరలోని కోలుకుని రీఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..

click me!

Recommended Stories