ఐపీఎల్ 2023 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. మిగిలిన 6 మ్యాచుల్లో సగం మ్యాచుల్లో గెలిచినా వేరే టీమ్స్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది గుజరాత్ టైటాన్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. మిగిలిన 6 మ్యాచుల్లో సగం మ్యాచుల్లో గెలిచినా వేరే టీమ్స్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది గుజరాత్ టైటాన్స్...
27
Image credit: PTI
గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అటు బ్యాటుతో,ఇటు బాల్‌తో అద్భుతంగా రాణించిన హార్ధిక్ పాండ్యా, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. అయితే ఈసారి హార్ధిక్ పాండ్యా నుంచి అలాంటి పర్ఫామెన్స్ రావడం లేదు...
37
Image credit: PTI
అయినా వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్, సీజన్ ఫస్టాఫ్‌లో తమను ఓడించిన కేకేఆర్‌ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్, ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఛాన్సులను మరింత క్లిష్టంగా మార్చుకుంది..
47
Image credit: PTI
గుజరాత్ టైటాన్స్ సక్సెస్‌లో హార్ధిక్ పాండ్యాకే పూర్తి క్రెడిట్ దక్కాలని అంటున్నాడు ఆ టీమ్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్. ‘హార్ధిక్ పాండ్యా చాలా దూకుడుగా ఉంటాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఈజీ మార్గాలు వెతకడం అతనికి బాగా అలవాటు...
57
టీమ్ విజయం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కెప్టెన్ అయ్యాక మొదటి ఓవర్ వేయాల్సిన అవసరం లేదు, కానీ వికెట్లు తీయాలనే ఉద్దేశంతో వేస్తాడు. ముంబైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మను అవుట్ చేశాడు..
లక్నోతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి కష్టంగా ఉన్న మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. టీమ్ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. కెప్టెన్ అయ్యాక ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. అతని కెప్టెన్సీలో ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విజయ్ శంకర్...
77
2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన విజయ్ శంకర్, ఆ టోర్నీ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉండడం, ఈ సీజన్‌లో విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శనతో కమ్‌బ్యాక్‌ని ఘనంగా చాటుకోవడం విశేషం..