డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌తో మొదలై ఢిల్లీ క్యాపిటల్స్ దాకా... ఐపీఎల్‌‌లో మొదట ఎలిమినేట్ అయిన టీమ్స్ ఇవే...

First Published May 14, 2023, 4:13 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. 12 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన రెండింట్లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరదు.. ఐపీఎల్‌ చరిత్రలో ప్లేఆఫ్స్ రేసు నుంచి మొదటిగా ఎలిమినేట్ అయిన టీమ్స్ ఇవే..

డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2008 సీజన్‌ని ఆరంభించిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, లీగ్‌లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి, 12 మ్యాచుల్లో ఓడింది. ఆరంగ్రేటం సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా నిలిచింది డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్... ఆ తర్వాత 2011, 2012 సీజన్లలోనూ డెక్కన్ ఛార్జర్స్... ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా నిలిచింది..

Image credit: PTI

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్: ఐపీఎల్ 2009 సీజన్‌లో 14 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకుంది కేకేఆర్. లీగ్‌లో రెండో మ్యాచ్‌లో నెగ్గిన కేకేఆర్, ఆ తర్వాత ఆఖరి రెండు మ్యాచుల్లోనే గెలిచింది. మధ్యలో ఆడిన 10 మ్యాచుల్లో వరుస పరాజయాలు అందుకుంది కేకేఆర్..

Latest Videos


PTI PhotoRavi Choudhary)(PTI05_13_2023_000485B)

పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ 2010, 2015 సీజన్లలో నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాతి సీజన్‌లో 14 మ్యాచుల్లో మూడే విజయాలు అందుకుని ఆఖరి స్థానంలో నిలిచింది..

పూణే వారియర్స్ ఇండియా: స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 2013 సీజన్‌లో 16 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుంది. పూణేకి దక్కిన నాలుగు విజయాల్లో రెండు విజయాలు, ఆఖరి మ్యాచుల్లో దక్కాయి.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 2016 సీజన్‌లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ, ఆ తర్వాతి సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఆ తర్వాత 2019 సీజన్‌లో వరుసగా అరడజను మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖరి స్థానంలో నిలిచింది..

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది ముంబై ఇండియన్స్. సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది..

Image credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమైన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. 14 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ఆరెంజ్ ఆర్మీ, 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది...

Image credit: PTI

ముంబై ఇండియన్స్: ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి గత సీజన్‌లో ఏ మాత్రం కలిసి రాలేదు. వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, మొదటి విజయాన్ని అందుకోవడానికి ముందే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్కమించిన జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.. 

రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్: రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్ల బ్యాన్ పడడంతో ఆ స్థానంలో వచ్చిన రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, ధోనీ కెప్టెన్సీలో 2016లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 14 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న పూణే, ఆఖరి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకుంది..
 

ఢిల్లీ క్యాపిటల్స్: ఐపీఎల్‌ చరిత్రలో మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, 2014, 2018 2023 సీజన్లలో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది..

click me!