IPL 2023: క్రికెట్ లో బ్యాటర్లకు అనుకులంగా నిబంధనలు ఉంటున్నా బంతితో రాణించడమే కాదు ప్రత్యర్థుల విజయావకాశాలపై నీళ్లు చల్లడంలో బౌలర్లదే కీలక పాత్ర.. ఐపీఎల్ లో టాప్ - 5 వికెట్ టేకర్స్ ఎవరంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బ్యాటర్లకు ఎంత ప్రాధాన్యముంటుందో మెరుపు వేగంతో బంతులు విసురుతూ వికెట్లు తీసే పేసర్లకు, బంతులను గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్లకూ కొదవలేదు. ఇలా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ - 5 వికెట్ టేకర్స్ ఎవరో చూద్దాం.
28
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కరేబియన్ దిగ్గజం డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో ఈ సీజన్ లో 2008 నుంచి 2022 వరకు ఆడాడు. మొత్తంగా ఐపీఎల్ లో 161 మ్యాచ్ లు ఆడిన బ్రావో.. 158 ఇన్నింగ్స్ లలో 183 వికెట్లు పడగొట్టాడు.
38
బ్రావో కంటే ముందు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత లంక పేసర్ లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్) పేరిట ఉండేది. మలింగ.. 2009 నుంచి 2019 వరకూ ఐపీఎల్ లో 122 మ్యచ్ లు ఆడి 170 వికెట్లు తీశాడు. మలింగ ఐదు వికెట్ల ప్రదర్శన ఒకసారి చేయగా ఆరు సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఇది కూడా రికార్డు.
48
ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న బౌలర్ యుజ్వేంద్ర చహల్. చహల్ 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. మొత్తంగా 131 మ్యాచ్ లలో 166 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే చహల్.. మలింగ రికార్డును సమం చేస్తాడు. ఈసీజన్ లో చహల్ 18 వికెట్లు తీయగలిగితే లీగ్ లో టాప్ వికెట్ టేకర్ గా ఉంటాడు.
58
చహల్ తర్వాత టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. 154 మ్యాచ్ లలో 166 వికెట్లు తీశాడు. గతంలో డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, డేర్ డెవిల్స్ తరఫున ఆడిన మిశ్రా.. ప్రస్తుత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. ఈ సీజన్ మిశ్రాకు చివరిది కావచ్చు.
68
ఈ జాబితాలో పీయూష్ చావ్లా ఐదో స్థానంలో ఉన్నాడు. చావ్లా 2008 నుంచి ఈ లీగ్ లో భాగమయ్యాడు. మొత్తంగా 165 మ్యాచ్ లలో 157 వికెట్లు పడగొట్టాడు. చావ్లా ఈసారి ముంబై జట్టులో ఉన్నా అతడికి అవకాశాలు రావడం కొంచెం కష్టమే.
78
చావ్లా తర్వాత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 184 మ్యాచ్ లు ఆడి 157 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో అశ్విన్ బంతితో రాణించగలిగితే అమిత్ మిశ్రా రికార్డును బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.
88
ఇక ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (154 వికెట్లు), సునీల్ నరైన్ (152), హర్భజన్ సింగ్ (150), బుమ్రా (145) లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.