దంచడంలో వాళ్లే టాప్.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ‘ఆ ఐదుగురు’ ఎవరంటే..?

Published : Mar 31, 2023, 10:02 AM IST

IPL 2023: క్రికెట్ అంటేనే బంతికి బ్యాట్ కు మధ్య జరిగే సమరం.. ఇక ఐపీఎల్ వంటి హై ఎమోషన్స్  గేమ్ లో దీని లెక్క వేరే  ఉంటది.  ఇక్కడ బ్యాట్ తో దంచిన వాళ్లకు డిమాండ్ మరో స్థాయిలో ఉంటుంది. 

PREV
18
దంచడంలో వాళ్లే టాప్.. ఐపీఎల్‌లో అత్యధిక  పరుగులు సాధించిన ‘ఆ ఐదుగురు’ ఎవరంటే..?

ఐపీఎల్ - 16వ సీజన్  ప్రారంభానికి మరికొన్ని గంటలే   ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇందుకు   సిద్ధంగా ఉంది.  ఈ నేపథ్యంలో  ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ - 5 బ్యాటర్లు ఎవరు..? అన్నది ఇక్కడ చూద్దాం.  

28

పరుగుల వీరులు.. ఐపీఎల్ అంటేనే  పూనకం వచ్చినట్టు ఊగిపోయే ఆటగాళ్లు కొంతమంది ఉంటారు. వీళ్లను అడ్డుకోవడం  కూడా కొంచెం కష్టమే. కానీ ఆడేది ఐపీఎల్ మ్యాచ్ అయినా   భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ అయినా బరిలోకి దిగాడటంటే రికార్డుల బాక్సులు బద్దలుకొట్టే అతికొద్దిమంది అరుదైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు.  ఈ లీగ్  చరిత్రలో అత్యధిక  పరుగుల వీరుడు మన కింగే..

38

కోహ్లీ ఐపీఎల్ లో  2008 నుంచి  ఒకే టీమ్ (ఆర్సీబీ) కు ఆడుతున్నాడు.  మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో  223 మ్యాచ్ లు ఆడి  215 ఇన్నింగ్స్ లలో  6,624 పరుగులు చేశాడు. ఇందులో  ఐదు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఐపీఎల్ లో ఆరు వేల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ కోహ్లీనే.  మరో  376 పరుగులు చేస్తే  కోహ్లీ 7 వేల పరుగుల క్లబ్ లో చేరతాడు.  

48

విరాట్ తర్వాత ఈ జాబితాలో ఉన్న ఆటగాడు శిఖర్ ధావన్.. ధావన్ కూడా 2008 నుంచి  లీగ్ లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు మొత్తంగా 206 మ్యాచ్ లు ఆడి  205 ఇన్నింగ్స్ లలో  6,244 రన్స్ చేశాడు.  ధావన్ కూడా రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు చేశాడు. 
 

58

ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న  బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్.. వార్నర్  2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు.  మొత్తంగా ఈ లీగ్ లో  167 మ్యాచ్ లు ఆడి 162 ఇన్నింగ్స్ లలో  5,881 పరుగులు చేశాడు. వార్నర్ కూడా  ఐపీఎల్ లో నాలుగు సెంచరీలు  55 హాఫ్ సెంచరీలు చేశాడు. 

68

వార్నర్ తర్వాత టీమిండియా, ముంబై జట్లకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ ఉన్నాడు.   రోహిత్.. 2008 నుంచి  ఇప్పటివరకు  227 మ్యాచ్ లు ఆడాడు. 222 ఇన్నింగ్స్ లలో  5,879 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో రోహిత్.. ఒక సెంచరీ 40 హాఫ్ సెంచరీలు సాధించాడు. 

78

ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న బ్యాటర్ సురేశ్ రైనా.  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ మెరుపులు మెరిపించిన ఈ చిన్న తాల.. 2008 నుంచి 2021 సీజన్ వరకూ   205 మ్యాచ్ లలో  200 ఇన్నింగ్స్  బ్యాటింగ్  కు వచ్చి  5,528 రన్స్ చేశాడు.   రైనా.. ఐపీఎల్ లో  ఓ సెంచరీ 39 హాఫ్ సెంచరీలు చేశాడు.  

88

రైనా తర్వాత  ఈ జాబితాలో  ఏబీ డివిలియర్స్ (5,162),  సీఎస్కే సారథి  ధోని (4,978), క్రిస్ గేల్ (4,965), రాబిన్ ఊతప్ప (4,952), దినేశ్ కార్తీక్ (4,376) లు ఉన్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories