అండర్19 కెప్టెన్లకు అచ్చిరాని ఐపీఎల్... ఆ ఇద్దరూ తప్ప అందరూ ఫెయిల్! ఉన్ముక్త్ చంద్ నుంచి...

Published : Apr 30, 2023, 05:27 PM ISTUpdated : Apr 30, 2023, 05:46 PM IST

ఐపీఎల్‌లో సక్సెస కావాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, అంతకుమించి అదృష్టం కూడా కలిసి రావాలి. అందుకే దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన ప్లేయర్లు కూడా ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారు. అండర్19 వన్డే వరల్డ్ కప్ కెప్టెన్లది కూడా ఇదే పరిస్థితి...

PREV
18
అండర్19 కెప్టెన్లకు అచ్చిరాని ఐపీఎల్... ఆ ఇద్దరూ తప్ప అందరూ ఫెయిల్! ఉన్ముక్త్ చంద్ నుంచి...
PTI Photo/Shailendra Bhojak) (PTI04_26_2023_000405B)

2008 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మొదటి రెండు సీజన్లలో కోహ్లీ పెద్దగా రాణించకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్, అతనిపై నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది. మిగిలిన వారికి ఇలాంటి సపోర్ట్ దక్కలేదు...

28

2010 అండర్19 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అశోక్ మెనారియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అశోక్ కెప్టెన్సీలో ఆడిన కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, మన్‌దీప్ సింగ్, జయ్‌దేవ్ ఉనద్కట్ ఇప్పటికీ ఐపీఎల్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు.. అయితే అశోక్ మెనారియా మాత్రం 2011-13 మధ్య మూడు సీజన్లు రాజస్థాన్ రాయల్స్‌కి ఆడి 29 మ్యాచులు ఆడి తెరమరుగయ్యాడు...

38

2012 అండర్19 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి కెప్టెన్సీ చేసిన ఉన్ముక్త్ చంద్, విరాట్ కోహ్లీ తర్వాత టైటిల్ గెలిచి, తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించాడు. అయితే టీనేజ్ వయసులో వచ్చిన క్రేజ్‌ని సక్సెస్‌గా ఊహించుకున్న ఉన్ముక్త్ చంద్, ఐపీఎల్‌లో ఫెయిల్ అయి, దేశవాళీ టోర్నీల్లోనూ అవకాశాలు దక్కించుకోలేక ప్రస్తుతం అమెరికాకి మకాం మార్చాడు... 2010 అండర్19 వరల్డ్ కప్ ఆడిన సందీప్ శర్మ, ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో ఆడాడు..

48
Vijay Zol

2014 U19 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి విజయ్ జోల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. విజయ్ కెప్టెన్సీలో ఆడిన సంజూ శాంసన్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్... ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్నారు. అయితే విజయ్ జోల్ మాత్రం 2014 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడి తెరమరుగయ్యాడు..

58

2016 అండర్19 వరల్డ్ కప్‌కి ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేశాడు. కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అంతో కొంతో సక్సెస్ అయిన అండర్19 కెప్టెన్ ఇషాన్ కిషనే. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఆడిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, ఖలీల్ అహ్మద్ ఐపీఎల్‌లో స్టార్లుగా వెలుగుతున్నారు.. సురేష్ రైనా కెప్టెన్సీలో గుజరాత్ లయన్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడం ఇషాన్ కిషన్‌కి బాగా కలిసి వచ్చింది.

68
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

2016 అండర్19 వరల్డ్ కప్‌కి ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేశాడు. కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అంతో కొంతో సక్సెస్ అయిన అండర్19 కెప్టెన్ ఇషాన్ కిషనే. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఆడిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, ఖలీల్ అహ్మద్ ఐపీఎల్‌లో స్టార్లుగా వెలుగుతున్నారు..

78

2020 అండర్19 వరల్డ్ కప్‌కి ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 3 సీజన్లు ఆడిన ప్రియమ్ గార్గ్, 2020లో 10 మ్యాచులు ఆడినా పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ప్రియమ్ గార్గ్, 2023 వేలంలో అమ్ముడుపోలేదు. రిప్లేస్‌మెంట్‌ ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చేరాడు ప్రియమ్ గార్గ్..

88

2022 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ యశ్ ధుల్. వరల్డ్ కప్ తర్వాత దేశవాళీ టోర్నీల్లో రికార్డులు తిరగరాసిన యశ్ ధుల్‌ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 2 మ్యాచుల్లో మాత్రమే ఆడిన ఢిల్లీ, అతన్ని పక్కనబెట్టేసింది...

Read more Photos on
click me!

Recommended Stories