ధోనీ, రోహిత్ శర్మలను దాటేసి, ఐపీఎల్‌లో హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు... కెప్టెన్సీ చేసిన దాంట్లో...

First Published Apr 26, 2023, 6:03 PM IST

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్‌ని రెండు భాగాలుగా విడదీయాల్సి వస్తే అది ఐపీఎల్ 2022కి ముందు, ఆ తర్వాతే! 2022 ఐపీఎల్‌కి ముందు టీమ్‌లో చోటు కూడా కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత టీమిండియాకి వైట్ బాల్ కెప్టెన్‌గా మారిపోయాడు...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ పూర్తిగా టీ20 ఫార్మాట్‌కి దూరమయ్యారు. దీంతో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్‌లు ఆడుతోంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా హార్ధిక్ పాండ్యాకే దక్కుతాయని సమాచారం...

PTI PhotoAtul Yadav)(PTI04_22_2023_000247B)

ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ సెలక్షన్‌పైన, కోచింగ్ స్టాఫ్ ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఈ టీమ్‌ టాప్ 8లో ఉంటే అదే చాలా గొప్ప అనుకున్నారంతా. అయితే అందరి అంచనాలను తలకిందులు చేశాడు పాండ్యా...

Latest Videos


PTI PhotoAtul Yadav)(PTI04_22_2023_000286B)

ఊహించని విధంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లోనూ మళ్లీ రాయల్స్‌నే చిత్తు చేసి మొట్టమొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచింది...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో కెప్టెన్‌గా 20 మ్యాచులు పూర్తి చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఇందులో 15 విజయాలు అందుకున్న హార్ధిక్ పాండ్యా, 20 అంతకంటే ఎక్కువ మ్యాచుల్లో కెప్టెన్సీ చేసి, ఎక్కువ విజయాల శాతం అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు...
 

Image credit: Getty

హార్ధిక్ పాండ్యా విన్నింగ్ పర్సెంటేజ్ 75గా ఉండగా మహేంద్ర సింగ్ ధోనీ 217 మ్యాచుల్లో 128 విజయాలతో 58.99 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు... ఐపీఎల్ 2008 నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీ, 2017 సీజన్‌తో పాటు 2021 సీజన్‌లో కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ చేయలేదు...
 

PTI Photo) (PTI04_25_2023_000381B)

ఐపీఎల్‌లో 8 సీజన్లలో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, 56.08 విజయాల శాతంతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన హార్ధిక్ పాండ్యా, ఏడు సీజన్లు ముంబై ఇండియన్స్ తరుపున ఆడి నాలుగు టైటిల్స్ అందించాడు...

click me!