రహానేని సెలక్ట్ చేసినందుకు హ్యాపీ! మరి సూర్య పరిస్థితి ఏంటి... ఆకాశ్ చోప్రా కామెంట్స్...

Published : Apr 26, 2023, 05:00 PM IST

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా తీవ్రంగా గాయపడడంతో ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు లేకుండానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ఆడబోతోంది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడడంతో ఆ ప్లేస్‌లో ఎవరిని ఆడిస్తారనే విషయంలో ఉత్కంఠ రేగింది..

PREV
16
రహానేని సెలక్ట్ చేసినందుకు హ్యాపీ! మరి సూర్య పరిస్థితి ఏంటి... ఆకాశ్ చోప్రా కామెంట్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన అజింకా రహానే, 15 నెలల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమైపోయింది...
 

26
KL Rahul

రిషబ్ పంత్ గాయపడడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం శ్రీకర్ భరత్‌తో పాటు కెఎల్ రాహుల్‌ని కూడా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. శ్రీకర్ భరత్‌కి ఐపీఎల్ 2023 సీజన్‌లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీంతో కెఎల్ రాహుల్‌ని ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా మిడిల్ ఆర్డర్‌లో ఆడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

36
Image credit: PTI

అయితే సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టు టీమ్‌కి ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... ‘అజింకా రహానే, టెస్టు టీమ్‌లోకి రావడం హ్యాపీగా ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి?

46

సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టు టీమ్‌కి ఎందుకు ఎంపిక చేశారు? ఒకే ఒక్క మ్యాచ్ అది కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతన్ని టెస్టుల నుంచి ఎందుకు తప్పించారు? ఈ మాత్రం దానికి అతన్ని టెస్టు టీమ్‌కి ఎంపిక చేయడం దేనికి? సెలక్ట్ చేసిన తర్వాత సరైన అవకాశాలు ఇవ్వకుండా డ్రాప్ చేయడం దేనికి?’ అంటూ వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా...

56

టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, నాగ్‌పూర్ టెస్టులో టెస్టు ఆరంగ్రేటం చేశారు. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో టెస్టుల్లో వచ్చిన సూర్యకి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య, వన్డేల్లో కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు...

66
Image credit: PTI

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా సున్నాలు చుట్టాడు. ఈ సీజన్‌లో సూర్య బ్యాటు నుంచి పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్‌లు రాకపోవడంతో అజింకా రహానేకే ఓటు వేశారు సెలక్టర్లు..

click me!

Recommended Stories