ఇప్పటికీ ఏ బౌలర్‌తో ఎప్పుడు వేయించాలో తెలీదు, వాడో కెప్టెన్‌ ఆ! బాబర్ ఆజమ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్...

First Published Apr 26, 2023, 5:32 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టాప్ ప్లేయర్లు అందరూ బిజీగా ఉండడంతో న్యూజిలాండ్ సీ టీమ్‌తో టీ20 సిరీస్ ఆడింది పాకిస్తాన్. కేన్ విలియంసన్, డివాన్ కాన్వే, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, లూకీ ఫర్గూసన్... ఇలా స్టార్ ప్లేయర్లు లేని న్యూజిలాండ్ టీమ్‌తో టీ20 సిరీస్ ఆడి కూడా టైటిల్ సాధించలేకపోయింది పాకిస్తాన్...
 

మొదటి రెండు టీ20ల్లో పాకిస్తాన్ ఘన విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాతే సీన్ మారింది. స్టార్ ప్లేయర్లు లేని న్యూజిలాండ్ జట్టు, మిగిలిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్‌ 2-2 తేడాతో ముగిసింది. అది జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో...

వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు అని పాక్ టీమ్ సగర్వంగా ప్రకటించుకునే షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ కూడా న్యూజిలాండ్ బ్యాటర్లను అవుట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. షాహీన్ ఆఫ్రిదీ అయితే 11+ ఎకానమీతో పరుగులు సమర్పించాడు...
 

Latest Videos


దీంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్. ‘న్యూజిలాండ్ టీమ్‌ కీ ప్లేయర్లు అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. అయితే పాకిస్తాన్, అదీ స్వదేశంలో సిరీస్ నెగ్గలేకపోయింది. ఇంత కంటే పెద్ద అవమానం ఏదైనా ఉంటుందా...
 

Babar Azam

తప్పుల గురించి మాట్లాడితే, ముందుగా చెప్పుకోవాల్సింది బాబర్ ఆజమ్ కెప్టెన్సీ గురించే. అతను కెప్టెన్సీ తీసుకుని నాలుగేళ్లు అయినా ఇప్పటికీ ఏ బౌలర్‌ని ఎప్పుడు వాడాలనే కనీస ఇంగితం కూడా నేర్చుకోలేకపోయాడు. ఇంత స్పష్టంగా తప్పులు కనిపిస్తుంటే చూడకుండా ఉండేందుకు మేమేం కళ్లులేని వాళ్లం కాదు...

Pakistan Cricket

కెప్టెన్సీ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వ్యక్తిత్వంలో ఉండాలి. టీమ్‌ని నడిపించే నాయకత్వం అనేది బలవంతంగా రుద్దితే రాదు. ఇప్పటికైనా బాబర్ ఆజమ్‌ కెప్టెన్‌గా పనికి రాడనే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు గుర్తిస్తే బెటర్..

తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటే దాన్ని తప్పు అన్నరు. దానికి వేరే పేరు ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయని వాడు కెప్టెన్ ఎలా అవుతాడు.. 

క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పుడు బుర్రలో కాస్త గుజ్జు ఉన్నవాడు ఎవ్వడైనా ఇఫ్తికర్ అహ్మద్‌కి బాల్ అందిస్తాడు. కానీ బాబర్ ఆజమ్ మాత్రం షాదబ్ ఖాన్‌కి బౌలింగ్ ఇచ్చాడు.

Babar Azam

రిజల్ట్ ఏమైంది.. అతని బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు బాది వదిలిపెట్టారు...  బాబర్ ఆజమ్ కెప్టెన్సీ గొప్పదనం చెప్పేందుకు ఇదొక్కటి చాలు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్..

click me!