లాస్ట్ సీజన్‌లో 9, 10 ప్లేస్.. ఇప్పుడు ప్లేఆఫ్స్.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!

First Published May 22, 2023, 10:43 AM IST

IPL 2023 Playoffs:  ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్  ఈ సీజన్ లో ప్లేఆఫ్స్  కు చేరాయి. కానీ గత సీజన్ లో ఈ  రెండు జట్ల   ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది.

ఐపీఎల్ లో  ప్రస్తుతం జరుగుతున్నది  16వ సీజన్. ఇందులో  ఏకంగా  9 సార్లు  ట్రోఫీలను నెగ్గింది ఆ రెండు జట్లే.  ప్లేఆఫ్స్ లో అయితే ఒక జట్టు  14 సీజన్లలో 12 సార్లు చేరగా.. మరో జట్టు 10 సార్లు  ఈ ఘనత సాధించింది.  కానీ గతేడాది ఈ రెండు జట్లు  దారుణ వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. 

ఐపీఎల్ - 2022లో  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల వైఫల్యాలు  చూసి ఆ జట్ల అభిమానులతో  పాటు ఇతర టీమ్స్ ఫ్యాన్స్ కూడా జాలి చూపించేంత దారుణంగా   ఉంది  ఈ రెండు జట్ల ప్రదర్శన. గత సీజన్ లో  ముంబై, చెన్నైలు  14 మ్యాచ్ లు ఆడి  నాలుగు మాత్రమే గెలిచి పది మ్యాచ్ లలో ఓడాయి. 

Latest Videos


రెండు జట్లకూ 8 పాయింట్లే ఉన్నా   నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో   ధోనీ సేన  9వ స్థానంలో ఉండగా ముంబై   పదో స్థానానికి పరిమితమైంది.  ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ లో లేకుండా  ఒక సీజన్ జరుగడం  గమనార్హం. 

కానీ ఈ ఏడాది  ఆ జట్టు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాయి. ఈ రెండు జట్లకూ స్టార్ ప్లేయర్లు దూరమైనా.. కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినా..  పటిష్టమైన బౌలింగ్  యూనిట్ లేకపోయినా ఉన్న వనరులను  సక్రమంగా వినియోగించుకున్నారు ధోని, రోహిత్ లు.  

ముంబై ఇండియన్స్ బౌలింగ్ అంటేనే బుమ్రా. అటువంటి బుమ్రా ఈ సీజన్ లో దూరమయ్యాడు.  ఆర్చర్ ను తీసుకొచ్చినా అతడు ఆడింది నాలుగు మ్యాచ్ లే అయినా అందులో కూడా ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు.  ట్రెంట్ బౌల్ట్  వంటి బౌలర్ ను రెండేండ్ల క్రితమే వేలానికి  వదిలేసిన ముంబై.. ఈ  సీజన్ లో   ఆకాశ్ మధ్వాల్, అర్జున్ టెండూల్కర్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్ వంటి అనుభవం లేని పేసర్లతో నెట్టుకొచ్చింది. 

Image credit: PTI

చెన్నైది కూడా దాదాపు ఇదే పరిస్థితి. సీజన్ కు ముందే కైల్ జెమీసన్, ముకేశ్ చౌదరి గాయాల కారణంగా దూరమయ్యారు. దీపక్ చాహర్ రెండు మ్యాచ్ లు ఆడగానే తొడ గాయంతో మళ్లీ చాలా మ్యాచ్ లకు  దూరంగానే ఉన్నాడు.   ఈ క్రమంలో ధోని అంతర్జాతీయ అనుభవమే లేని ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీశ పతిరానలతో అద్భుతాలు చేశాడు. 

Image credit: PTI

బ్యాటింగ్ లో మాత్రం ఈ రెండు జట్లు రాక్ సాలిడ్ గా ఉండటం ముంబై, చెన్నైలకు కలిసొచ్చింది. ముంబైలో రోహిత్, ఇషాన్, సూర్య, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నెహల్ వధెర లు ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.  

చెన్నైలో కూడా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే,  రవీంద్ర జడేజా.. ఆఖర్లో ధోని  వచ్చి సిక్సర్ల మెరుపులతో తమ జట్టు భారీ స్కోర్లు చేయడంలో దోహదపడ్డారు. ఇక మరోసారి ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ కు చేరిన నేపథ్యంలో   ముంబై - చెన్నైలు  ఫైనల్ చేరితే అది మరో ఎల్‌క్లాసికోకు  రంగం సిద్ధమైనట్టే.. 

click me!