సుమారు రెండు నెలలుగా దేశంలోని పది నగరాల్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 వ ఎడిషన్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఆదివారం ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లతో లీగ్ దశ ముగిసింది.
26
Image credit: PTI
ఆదివారం రాత్రి వరకూ ప్లేఆఫ్స్ లో నాలుగో స్థానం కోసం రెండు జట్ల (ముంబై, బెంగళూరు) మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కు లైన్ క్లీయర్ అయింది. ఇక రేపటి నుంచి ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ సమరం మొదలుకానుంది.
36
ప్లేఆఫ్స్ లో భాగంగా ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ మే 23 (మంగళవారం)న గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలోని చెపాక్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
46
మే 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా చెపాక్ లోనే జరుగుతుంది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ లు తలపడతాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫస్ట్ క్వాలిఫయర్ లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఎలిమినేటర్ లో ఓడిన జట్టు బ్యాగ్ సర్దుకోవడమే.
56
మే 26న ఎలిమినేటర్ విజేత, ఫస్ట్ క్వాలిఫయర్ లో ఓడిన జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రెండో క్వాలిఫయర్ జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టు ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది.
66
Image credit: Sandeep Rana
ఇక మే 28న క్వాలిఫయర్ -1 విజేత, క్వాలిఫయర్ - 2 విజేత ల మధ్య అహ్మదాబాద్ వేదికగా వచ్చే ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి తుది పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ - 16 సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది.