ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మనదగ్గర ఉంది... విరాట్ కోహ్లీ ఏడో ఐపీఎల్‌ సెంచరీకి క్రికెట్ ప్రపంచం ఫిదా...

Published : May 21, 2023, 11:30 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు బాది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. గత మ్యాచ్‌లో క్రిస్ గేల్ 6 సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్, నేటి మ్యాచ్‌లో టాప్‌కి ప్లేస్ సొంతం చేసుకున్నాడు...  

PREV
19
ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మనదగ్గర ఉంది... విరాట్ కోహ్లీ ఏడో ఐపీఎల్‌ సెంచరీకి క్రికెట్ ప్రపంచం ఫిదా...
(PTI Photo/Shailendra Bhojak)(PTI05_21_2023_000407B)

‘చాలామంది నా టీ20 బ్యాటింగ్ పడిపోతుందని అన్నారు. నాకైతే అలా అనిపించలేదు. నా బెస్ట్ టీ20 క్రికెట్ మళ్లీ ఆడుతున్నట్టు అనిపిస్తోంది. నా ఆటను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా...

29
Virat Kohli

టీ20 క్రికెట్‌ని నేను ఇలాగే ఆడతా. గ్యాప్స్ చూసి బౌండరీలు కొట్టడం, సందర్భం వచ్చినప్పుడు సిక్సర్లు కొట్టడమే నాకు తెలుసు. ఇప్పటికైతే నా ఆటతో పూర్తి సంతోషంగా ఉన్నా.. ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

39
PTI Photo)(PTI05_18_2023_000334B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో 600+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డుప్లిసిస్ టాప్‌లో 730 పరుగులతో ఉంటే విరాట్ కోహ్లీ 639 పరుగులు చేశాడు..

49
Image credit: PTI

‘ఎప్పుడు అతని అవసరం ఉంటుందో విరాట్ అక్కడ కచ్చితంగా ఉంటాడు..’ అంటూ ఏబీ డివిల్లియర్స్ ట్వీట్ చేశాడు. ‘బ్యాక్ టు బ్యాట్ సెంచరీస్ ఫస్ GOAT విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడంలో ఓ కిక్కు ఉంటుంది..’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు...
 

59

‘విరాట్ కోహ్లీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకైనా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలి...’ అంటూ ఎస్ బద్రీనాథ్ ట్వీట్ చేశాడు.

 

69

‘విరాట్‌ని చూస్తుంటే 2016లో ఉన్నట్టుగా ఉంది. బ్యాటు టు బ్యాట్ సెంచరీలు. మాస్టర్‌లా మారిపోయాడు... ’ అంటూ ఇయాన్ బిషప్ ట్వీట్ చేశాడు..

79

‘ది రియల్ కింగ్ విరాట్ కోహ్లీకి 82వ సెంచరీ. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్వితీయ సెంచరీ. నిజమైన ఛాంపియన్. ఎంతో మందికి విరాట్ ఆదర్శం..’ అంటూ పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమీర్ ట్వీట్ చేశాడు..

89

‘ఎప్పుడూ విరాట్ కోహ్లీపై డౌట్స్ పడకండి. ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్. అతను యూనివర్సల్ బాస్‌ని దాటేశాడు. నేను రిటైర్మెంట్‌ని నుంచి వెనక్కి వచ్చి, వచ్చే ఏడాది మళ్లీ ఆడతా విరాట్’ అంటూ క్రిస్ గేల్ కామెంట్ చేశాడు..

99

‘విరాట్ కోహ్లీ నుంచి మరో క్లాస్ సెంచరీ. ఆర్‌సీబీ భారాన్ని మొత్తం మోసాడు. సూపర్బ్ బ్యాటింగ్’ అంటూ యూసఫ్ పఠాన్ ట్వీట్ చేయగా ‘ విరాట్ కోహ్లీకి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు. కింగ్ ఫర్ ఏ రీజన్’ అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories