శుబ్‌మన్ గిల్‌కి ఆరెంజ్ క్యాప్ ఫిక్స్... రుతురాజ్ గైక్వాడ్, షాన్ మార్ష్, విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్...

Published : May 29, 2023, 04:56 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసు దాదాపు ముగిసినట్టే. టాప్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌కి పోటీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డివాన్ కాన్వే, ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసినా ఆరెంజ్ క్యాప్ నెగ్గలేడు...  

PREV
16
శుబ్‌మన్ గిల్‌కి ఆరెంజ్ క్యాప్ ఫిక్స్... రుతురాజ్ గైక్వాడ్, షాన్ మార్ష్, విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్...

శుబ్‌మన్ గిల్ 16 మ్యాచుల్లో 60.79 సగటుతో 851 పరుగులు చేయగా ఆర్‌సీబీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లిసిస్ 730, విరాట్ కోహ్లీ 639 పరుగులు చేశారు. సీఎస్‌కే ఓపెనర్ డివాన్ కాన్వే 625 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు..

26

ఐదో స్థానంలో ఉన్న యశస్వి జైస్వాల్ 625, ఆరో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 605 పరుగులు  ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోగా సీఎస్‌కే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 564 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు...

36
Image credit: PTI

డివాన్ కాన్వే ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ కాదు కదా, డబుల్ సెంచరీ బాదినా శుబ్‌మన్ గిల్ 851 పరుగులను చేరుకోలేడు. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా శుబ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...
 

46
PTI Photo/Kunal Patil) (PTI05_26_2023_000255B)

అతిపిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన బ్యాటర్‌గా శుబ్‌మన్ గిల్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ వయసు 2021లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ 23 ఏళ్ల 263 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ సాధించాడు...

56


2008లో షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ గెలిచినప్పుడు అతని వయసు 24 ఏళ్ల 328 రోజులు. 2016లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన సమయంలో విరాట్ కోహ్లీ వయసు 27 ఏళ్ల 206 రోజులు.. 
 

66

730 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఈ సీజన్‌లో  కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. గత మూడు సీజన్లలో ఈ రికార్డు సాధిస్తూ వచ్చిన కెఎల్ రాహుల్, పేలవ ఫామ్‌, గాయం కారణంగా వెనకబడ్డాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories