ఘనంగా మొదలైన ఐపీఎల్ 2023 సీజన్‌కి ఘనమైన ముగింపు మాత్రం దక్కలేదు. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్, సోమవారానికి వాయిదా పడింది. ఐపీఎల్ చరిత్రలో సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి...
అహ్మదాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం ఎండ కాస్తూ, వాతావరణం మ్యాచ్‌కి అనుకూలంగానే కనిపిస్తోంది. అయితే ఏ నిమిషాన ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఫ్యాన్స్ భయపడుతున్నారు..
27
PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000356B)
సౌతాఫ్రికా20 మొదటి సీజన్ ఫైనల్ కూడా ఈ విధంగానే వర్షం కారణంగా వాయిదా పడి, రిజర్వు డేలో ఫలితం తేలింది. పేరుకి సౌతాఫ్రికా20 అయినా అక్కడున్న ఫ్రాంఛైజీలన్నీ ఐపీఎల్ యజమానులవే. ఐపీఎల్ 2023 ఫైనల్ కూడా రిజర్వు డేకి వాయిదా పడడం విశేషం..
ఇప్పటిదాకా నాలుగు సార్లు మాత్రమే ఒకే తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. 2008, 2014 సీజన్లలోనే జూన్ 1న ఫైనల్ మ్యాచులు జరిగతే, 2009, 2015 సీజన్లలో మే 24న ఫైనల్ జరిగింది...
47
2012, 2018 సీజన్లలో ఫైనల్ మ్యాచ్ మే 27న జరగగా మే 29న ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2016, 2022 సీజన్లు కూడా మే 29నే ముగిశాయి.
57
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించగా, 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచింది. దీంతో గత ఏడాది టైటాన్స్‌కి టైటిల్ అందించిన మే 29, ఈసారి మరో టైటిల్ అందిస్తుందని ఆశపడుతున్నారు ఆ టీమ్ ఫ్యాన్స్...
67
2009 నుంచి 2019 వరకూ ఫైనల్ మ్యాచ్‌లన్నీ ఆదివారం రోజే ముగిశాయి. మధ్యలో 2011 సీజన్ ఫైనల్ మాత్రమే శనివారం జరగగా కరోనా కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 2020లో ఫైనల్ మ్యాచ్‌ని మంగళవారం నిర్వహించారు...
77
Image credit: PTI
కరోనా కేసులతో రెండు ఫేజ్‌లుగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ శుక్రవారం ముగిసింది. 2022 సీజన్ మళ్లీ సండేరోజు ముగియగా ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది..