సాయి సుదర్శన్‌కి ఐపీఎల్ కంటే అక్కడే ఎక్కువ... ఫైనల్‌లో సీఎస్‌కేపై రికార్డులు బద్ధలు కొట్టిన చెన్నై కుర్రాడు...

Published : May 29, 2023, 10:27 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో అందరి కళ్లు శుబ్‌మన్ గిల్‌పైనే ఉన్నాయి. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ కోసం సీఎస్‌కే స్కెచ్ వేసుకుంటే, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్‌లా వచ్చిన సాయి సుదర్శన్, టైటాన్స్‌కి కొండంత స్కోరు అందించాడు...

PREV
19
సాయి సుదర్శన్‌కి ఐపీఎల్ కంటే అక్కడే ఎక్కువ... ఫైనల్‌లో సీఎస్‌కేపై రికార్డులు బద్ధలు కొట్టిన చెన్నై కుర్రాడు...
Sai Sudharsan

47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసిన సాయి సుదర్శన్, 4 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. నేటి మ్యాచ్‌లో సాయి సుదర్శన్ స్ట్రైయిక్ రేటు 204.26. అయితే సాయి సుదర్శన్ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఎప్పుడూ 150+ పరుగులు చేయకపోవడం విశేషం...

29

రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కూడా 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్, ఆఖరి ఓవర్‌కి ముందు రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు..

39
Image credit: PTI

తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి సుదర్శన్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఇక్కడి కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటున్నాడు సాయి సుదర్శన్...

49
Image credit: PTI

TNPL టోర్నీలో జూనియర్ సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న సాయి సుదర్శన్‌, అక్కడ రూ.21.6 లక్షలు తీసుకుంటున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు సాయి సుదర్శన్..

59

2018 ఫైనల్‌లో సీఎస్‌కే బ్యాటర్ షేన్ వాట్సన్ 117 పరుగులు చేయగా 2014లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా 115 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 96 పరుగులతో మూడో స్థానంలో ఉండగా మురళీ విజయ్ 95, మనీశ్ పాండే 94 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు..

69

ఐపీఎల్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు సాయి సుదర్శన్. మనన్ వోహ్రా 20 ఏళ్ల 318 రోజుల వయసులో పంజాబ్ కింగ్స్ తరుపున 67 పరుగులు చేయగా ప్రస్తుతం సాయి సుదర్శన్ వయసు 21 ఏళ్ల 226 రోజులు...

79

సాయి సుదర్శన్ దెబ్బకు ఐపీఎల్ ఫైనల్‌లో 50+ పరుగులు సమర్పించిన మొట్టమొదటి సీఎస్‌కే బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు తుషార్ దేశ్‌పాండే. 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించిన తుషార్ దేశ్‌పాండే, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు..
 

89
PTI Photo/Kunal Patil)(PTI04_08_2023_000299B)

ఓవరాల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 2016 ఫైనల్‌లో షేన్ వాట్సన్ 61 పరుగులు ఇవ్వగా, తుషార్ దేశ్‌పాండే, లూకీ ఫర్గూసన్ (కేకేఆర్ 2021) 56 పరుగులు సమర్పించి రెండో స్థానంలో ఉన్నాడు. 

99

ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా కూడా చెత్త రికార్డు నెలకొల్పాడు తుషార్ దేశ్‌పాండే. 2022 సీజన్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 551 పరుగులు ఇవ్వగా 2020 సీజన్‌లో కగిసో రబాడా 548 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో తుషార్ దేశ్‌పాండే 564 పరుగులు ఇచ్చి టాప్‌లో నిలిచాడు..

click me!

Recommended Stories