ధోనీతో ఆడితే అంతే! శివమ్ దూబే సక్సెస్‌పై సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Published : May 15, 2023, 03:37 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొడుతున్నప్లేయర్లలో శివమ్ దూబే కూడా ఒకడు. ఇప్పటికే సీఎస్‌కే తరుపున ఈ సీజన్‌లో 30 సిక్సర్లు బాదిన శివమ్ దూబే మరో 6 సిక్సర్లు కొడితే, ఒకే సీజన్‌లో సీఎస్‌కే తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలుస్తాడు...

PREV
16
ధోనీతో ఆడితే అంతే! శివమ్ దూబే సక్సెస్‌పై సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

శివమ్ దూబే ఈ 2023 సీజన్‌లో 30 సిక్సర్లు బాదితే, అందులో 19 సిక్సర్లు స్పిన్ బౌలర్ల బౌలింగ్‌లో రావడం విశేషం. ఇప్పటికే 12 మ్యాచుల్లో 363 పరుగులు చేసిన శివమ్ దూబే, 157 స్ట్రైయిక్ రేటుతో 40కి పైగా సగటుతో అదరగొడుతున్నాడు..

26
Shivam Dube

2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శివమ్ దూబే, ఇంతకుముందు రెండు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి, ఓ సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కి ఆడాడు. అయితే ఆ మూడు సీజన్లలో కలిపి శివమ్ దూబే చేసింది 350 పరుగులే..

36

అయితే గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 11 మ్యాచులు ఆడి 289 పరుగులు చేసిన శివమ్ దూబే, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి బెస్ట్ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు..
 

46
Image credit: PTI

‘ఇందుకే నేను ధోనీ కెప్టెన్సీ గురించి తరుచూ చెబుతూ ఉంటాను. శివమ్ దూబే మిగిలిన ఫ్రాంచైజీలకు కూడా ఆడాడు. అయితే అతను ఇప్పుడు ఇలా ఆడడం చూడలేదు...
 

56
Image Credit: Shivam Dube Instagram


ధోనీ కెప్టెన్సీలో ఆడితే స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం దొరుకుతుంది. ఇలా ఆడు, అలా ఆడు అనే ప్రెషర్ ఉండదు. నీ బ్యాటింగ్ స్టైల్‌లో ఏంటో తెలుసుకుని అలాగే ఆడేందుకు కావాల్సిన ఫ్రీడమ్‌, ధోనీ ఇస్తాడు...

66

శివమ్ దూబే ఈ సీజన్‌లో నాలుగు లేదా ఐదో స్థానాల్లో వస్తున్నాడు. ఈ ప్లేస్‌లో వస్తే కావాల్సినన్ని ఓవర్లు ఆడొచ్చు, భారీ షాట్లు ఆడొచ్చు. అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి కానీ, కిందకి కానీ జరపడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!

Recommended Stories