సీజన్‌లో తొలి సిక్సర్ బాదిన డేవిడ్ వార్నర్... మొదటి వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్...

Published : Apr 24, 2023, 08:34 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ దాదాపు ఫస్టాఫ్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో అన్నీ ఫ్రాంఛైజీలు సగం (7) లీగ్ మ్యాచులను పూర్తి చేసుకుంటాయి. అయితే ఇప్పటిదాకా జరగని చిత్రాలు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జరిగాయి...

PREV
17
సీజన్‌లో తొలి సిక్సర్ బాదిన డేవిడ్ వార్నర్... మొదటి వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్...
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 306 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు డేవిడ్ వార్నర్. అయితే మొదటి ఆరు మ్యాచుల్లో 285 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయాడు..

27
Image credit: PTI

డేవిడ్ వార్నర్‌ తప్ప మిగిలిన టాపార్డర్ బ్యాటర్లు కూడా ఫెయిల్ అవ్వడంతో మొదటి 6 మ్యాచుల్లో పవర్ ప్లేలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఎట్టకేలకు తన పాత టీమ్‌పైనే ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి సిక్సర్ సాధించాడు డేవిడ్ వార్నర్...

37
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000318B)

వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. 290 పరుగుల తర్వాత తొలి సిక్సర్ బాదిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ చరిత్రలో సీజన్‌లో ఒక్క సిక్సర్ బాదకుండా ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...

47
Image credit: PTI

పృథ్వీ షాని పక్కనబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, ఫిలిప్ సాల్ట్‌ని ఓపెనర్‌గా పంపింది. భువీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఫిలిప్ సాల్ట్.

57

ఐపీఎల్‌లో అత్యధిక మందిని డకౌట్ చేసిన బౌలర్‌గా రెండో స్థానంలో నిలిచాడు భువీ. లసిత్ మలింగ 36 సార్లు బ్యాటర్లను డకౌట్ చేయగా బ్రావో 24 డకౌట్ల రికార్డును అధిగమించిన భువనేశ్వర్ కుమార్ 25 మందిని సున్నాకే పెవిలియన్ చేర్చాడు..

67

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 14.4 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు సుందర్...

77

20 బంతుల్లో 21 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్, అదే ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆమన్ హకీం ఖాన్ వికెట్లను తీశాడు. 57/2 వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సుందర్ ఓవర్ కారణంగా 62/5 స్థితికి చేరుకుంది...
 

click me!

Recommended Stories