పృథ్వీ షాని తీసి పక్కనబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఇంకెన్నాళ్లు భరిస్తారంటూ...

Published : Apr 24, 2023, 08:11 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో పృథ్వీ షా ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని ఎంతో నమ్మకంగా చెప్పాడు ఆ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్. అయితే పృథ్వీ షా మాత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మొదటి ఆరు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షాని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తీసి పక్కనబెట్టేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

PREV
18
పృథ్వీ షాని తీసి పక్కనబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఇంకెన్నాళ్లు భరిస్తారంటూ...

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 6 మ్యాచుల్లో 40 బంతులు ఆడి 47 పరుగులు చేసిన పృథ్వీ షా, రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. ఇప్పటిదాకా చేసిన అత్యధిక స్కోరు 13 పరుగులు మాత్రమే. పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బాగా ఆడతాడు? నేక్ట్స్ మ్యాచ్‌లో బాగా ఆడతాడంటూ ఎదురుచూసిన టీమ్‌కి నిరాశే ఎదురైంది...

28

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో ఓ వైపు డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఎండ్‌లో పృథ్వీ షా 13 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

38

‘పృథ్వీ షా చాలా మంచి ప్లేయర్. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అతనికి టైం కావాలి. అతను తిరిగి టీమ్‌లోకి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని నమ్ముతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...
 

48

‘ఎలాంటి ప్లేయర్ అయినా సరే వరుసగా ఫెయిల్ అవుతూ కొనసాగించడం మంచిది కాదు. ఏదీ వర్కవుట్ కాకపోతే దాన్ని మార్చడమే మంచిది. బెంగళూరులో పృథ్వీ షా నిర్లక్ష్యంగా రనౌట్ అయినప్పుడే టీమ్ నుంచి తప్పించాల్సింది. ఇప్పటికైనా తప్పించారు. టీమ్‌ నుంచి తప్పించాక అతనికి చాలా విషయాలు తెలిసి వస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ ధుల్..
 

58

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఎట్టకేలకు కేకేఆర్‌పై బోణీ కొట్టింది. అయితే ఇప్పటిదాకా పృథ్వీ షా ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. 6 మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయిన పృథ్వీ ... 12, 7, 0, 1, 0, 13 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

68

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పృథ్వీ షా బ్యాటింగ్‌ని చీల్చి చెండాడేశాడు. ‘పృథ్వీ షాతో కలిసి అండర్19 ఆడిన శుబ్‌మన్ గిల్ ఇప్పుడు టీమిండియాకి టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడుతున్నాడు. పృథ్వీ షా ఇంకా ఐపీఎల్‌లో ఆడేందుకే తెగ కష్టపడుతున్నాడు...
 

78

ప్రతీ క్రికెటర్‌కి బ్యాడ్ ఫేజ్ సాధారణ విషయమే కానీ పృథ్వీ షా అవుట్ అవుతున్న విధానమే దారుణంగా ఉంది. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. నిజంగా అతనికి ఆడడం ఇష్టం ఉందా అనే అనుమానం కలుగుతోంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

88
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షాని తప్పించి ఫిలిప్ సాల్ట్‌ని ఓపెనర్‌గా పంపింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఫిలిప్ సాల్ట్, భువీ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.. పృథ్వీ షా ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని మరోసారి టీమ్‌లోకి తీసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన సర్ఫరాజ్, 9 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

click me!

Recommended Stories