స్మృతి సరిగ్గానే చెప్పింది! నీలాగే రెండే మ్యాచులు గెలిచింది... ముఖం మీదే విరాట్ కోహ్లీ పరువు తీసిన డానీ...

Published : Apr 04, 2023, 04:01 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘనంగా ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌కి ముందు మిస్టర్ నాగ్స్ (డానిష్ సెయిట్)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

PREV
18
స్మృతి సరిగ్గానే చెప్పింది! నీలాగే రెండే మ్యాచులు గెలిచింది... ముఖం మీదే విరాట్ కోహ్లీ పరువు తీసిన డానీ...

ఈ ఇంటర్వ్యూలో డానీ సెయిట్, ‘ట్రిప్, టైడ్, మ్యాన్, 49’ పదాలు వాడి ఓ కవిత చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని వాడాడు. ‘మీ కలలను సాకారం చేసుకోండి, మీలోని కాంతిని వెలిగించండి. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయినా బ్యాట్ చేయాల్సిందే. కొన్నిసార్లు 263 రావచ్చు, ఇంకొన్నిసార్లు 49. జీవితం నిన్ను పచ్చడి చేసేయొచ్చు. కానీ ఆ సమయంలోనూ చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వేసెయ్. నువ్వు సెంచరీ చేసినా, లేక డక్ అయినా.. జీవితం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడా నిలిచిపోకు...’ అంటూ రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ..

28

ఇదే సమయంలో విరాట్ కోహ్లీని డైరెక్ట్‌గా ట్రోల్ చేశాడు డానిష్ సెయిట్. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంది స్మృతి మంధాన. ‘స్మృతి కెప్టెన్సీ తీసుకున్నప్పుడు విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని, టీమ్‌ని నడిపిస్తానని చెప్పింది. ఆ తర్వాత ఈ సీజన్‌లో మనం రెండే రెండు మ్యాచులు గెలిచాం. నాకు ఆమె కరెక్టుగా చెప్పిందని అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు డానిష్ సెయిట్...

38

విరాట్ కోహ్లీతో ఇలా మొహం మీదే చెప్పి పరువు తీయగల ధైర్యం ఒక్క డానిష్ సెయిట్ (మిస్టర్ నాగ్)కి మాత్రమే ఉంది. దీనికి కారణం కోహ్లీతో డానిష్‌కి మంచి స్నేహం ఉంది. అదీకాకుండా అవతలి వ్యక్తి చిన్నబుచ్చికోకుండా కామెడీ చేస్తున్నట్టుగా చురకలు వేయడంతో డానీ ఎక్స్‌పర్ట్. దీంతో విరాట్ కోహ్లీని ఇలా డైరెక్ట్‌గా ట్రోల్ చేయగలుగుతున్నాడు డానీ. 
 

48
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000356B)

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో సతమతమయ్యాడు. టీమిండియాతో మ్యాచుల్లోనూ, ఆర్‌సీబీతో తరుపున మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ నీకు పెట్స్ అంటే ఎంత ఇష్టమైతే మాత్రం ఇన్ని డక్స్‌ని పెంచుకుంటూ పోతావా? అంటూ కామెంట్ చేశాడు డానీ..

58
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000388B)

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 9 సీజన్లు ఆడినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2016 సీజన్‌లో 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీని ఫైనల్‌కి చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. 2019 సీజన్‌లో వరుసగా 6 మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, 14 మ్యాచుల్లో ఐదే విజయాలు అందుకుని... ఆఖరి స్థానంలో నిలిచింది...

68

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ టీమ్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన మహిళల ఆర్‌సీబీ, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
 

78

గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యఛేదనలో 190 పరుగులకి పరిమితమైన స్మృతి మంధాన టీమ్, యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌ని 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది. వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఎట్టకేలకు యూపీ వారియర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.
 

88
Smriti Mandhana

ఆ తర్వాత గుజరాత్ జెయింట్స్‌ని 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అయితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిన ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది.. 

Read more Photos on
click me!

Recommended Stories