ఇంకోసారి ఇలా నో బాల్స్ వేస్తే, నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా! బౌలర్లకు వార్నింగ్ ఇచ్చిన ధోనీ...

First Published Apr 4, 2023, 3:26 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ మాహీకి ఫేర్‌వెల్ సీజన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2022 సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ, రవీంద్ర జడేజా సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తిరిగి సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీ, గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది బ్యాటుతో మెరుపులు కూడా మెరిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగుల భారీ స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేస్తే డివాన్ కాన్వే 47, శివమ్ దూబే 27, మొయిన్ ఆలీ 19, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు..

Latest Videos


ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, 3 బంతుల్లో 2 సిక్సర్లు బాది అవుట్ అయ్యాడు. ఈ లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, 12 పరుగుల తేడాతో పోరాడి ఓడింది..

లక్నో బౌలర్లు 16 ఎక్స్‌ట్రాలు వేయగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఆఖరి 2 ఓవర్లలో 5 ఎక్స్‌ట్రాలు వేశారు చెన్నై బౌలర్లు. ఈ విషయంపై సీరియస్ అయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_02_2023_000246B)

‘టెర్రఫిక్ హై స్కోరింగ్ గేమ్. ఈ వికెట్ ఎలా ఉంటుందోనని భయపడ్డాం. అయతే ఫస్ట్ గేమ్ భలే మజానికి ఇచ్చింది. నేను ఈ పిచ్‌ మీద బ్యాటింగ్ చేయడం కష్టమవుతుందని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలించింది. 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000321B)

ఈ మ్యాచ్ తర్వాత జరిగే మ్యాచులకు కూడా ఇలాంటి పిచ్ ఉంటుందా? చూడాలి. ఫాస్ట్ బౌలింగ్‌లో కాస్త ఇంప్రూమెంట్ అవసరం. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం నేర్చుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో గమనించాల్సిన బాధ్యత కూడా బౌలర్లపై ఉంటుంది..
 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000351B)

ఇంకో విషయం మా బౌలర్లు ఇకనైనా నో బాల్స్, ఎక్స్‌ట్రా వైడ్లు వేయడం మానేయాలి. లేదంటే కొత్త కెప్టెన్ కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్. ఇంకోసారి చెప్పను. మేం ఇన్ని పరుగులు చేయడానికి పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరించడమే కారణం...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బెన్ స్టోక్స్‌కి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. అయితే తొలి రెండు మ్యాచుల్లో బెన్ స్టోక్స్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. రెండు మ్యాచుల్లోనూ కలిపి 15 పరుగులే చేసిన బెన్ స్టోక్స్, రెండో మ్యాచ్‌లో ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చాడు.. 

click me!