3 బాల్స్, 2 సిక్సర్లు, 2 రికార్డులు... 5 వేల పరుగుల క్లబ్‌లో చేరిన మహేంద్ర సింగ్ ధోనీ...

First Published Apr 3, 2023, 10:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ కేవలం బౌండరీలతోనే డీల్ చేయాలని ఫిక్స్ అయి వచ్చినట్టు ఉన్నాడు. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదిన మహేంద్ర సింగ్ ధోనీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాది, 5 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు...

MS Dhoni

ఐపీఎల్ చరిత్రలో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఏడో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. విరాట్ కోహ్లీ 6706 పరుగులతో టాప్‌లో ఉంటే శిఖర్ ధావన్ 6284, డేవిడ్ వార్నర్ 5937, రోహిత్ శర్మ 5880, సురేష్ రైనా 5528, ఏబీ డివిల్లియర్స్ 5162 పరుగులతో ధోనీ కంటే ముందున్నారు... 4965 ఐపీఎల్ పరుగులు చేసిన క్రిస్ గేల్, 4952 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... 5 వేల పరుగుల క్లబ్‌ని మిస్ అయ్యారు.

MS Dhoni

ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి వికెట్ కీపింగ్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ వస్తూ 5 వేల పరుగులు చేసిన మొదటి బ్యాటర్ కూడా ధోనీ. ఏబీ డివిల్లియర్స్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 5 వేల పరుగులు చేశాడు..

Latest Videos


Image credit: PTI

20వ ఓవర్ రెండో బంతికి బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌లో 277 బంతులు ఫేస్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, అందులో 49 ఫోర్లు, 55 సిక్సర్లు బాది టాప్‌లో నిలిచాడు..

మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రాగానే జియో వ్యూయర్‌షిప్ ఒక్కసారిగా పెరిగింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 1.6 కోట్ల మంది, జియో సినిమా యాప్‌లో ధోనీ బ్యాటింగ్‌ని వీక్షించగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అది 1.7 కోట్లకు పెరిగింది...

Image credit: PTI

చెపాక్ స్టేడియంలో 49 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 1375 పరుగులు చేశాడు. ఇక్కడ మాహీ స్ట్రైయిక్ రేటు 149.17. హోం గ్రౌండ్‌లో 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ధోనీ.. 
 

click me!