సీఎస్‌కేకి అదే పెద్ద అడ్వాంటేజ్! చెన్నైలో చెన్నైపై గెలవాలంటే... - హర్భజన్ సింగ్...

First Published May 23, 2023, 4:21 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే టైటిల్ గెలిచి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడనుంది...

‘గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు టీమ్స్‌ కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చెన్నైలో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుండడం చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా పెద్ద అడ్వాంటేజ్. చెపాక్ స్టేడియం పరిస్థితుల గురించి వాళ్లకి బాగా తెలుసు...
 

ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎక్కడికి వెళ్లినా, హోం గ్రౌండ్‌లో దక్కినట్టుగానే సపోర్ట్ దక్కుతోంది. చెన్నైలో ఆడుతుంటే ఆ సపోర్ట్ మరో రేంజ్‌లో ఉంటుంది. గ్రూప్ స్టేజీలో ఎలా ఆడినా ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించడం తేలికైన విషయం కాదు...
 

ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో వారి ఆట వేరే లెవెల్‌లోకి వెళ్లిపోతుంది. డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ పూర్తి ప్రిపరేషన్స్‌తో బరిలో దిగుతున్నారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి, భారీ భాగస్వామ్యం నిర్మించడం, భారీ స్కోర్లు చేయడం ఈ ఇద్దరికీ బాగా తెలుసు...
 

ఓపెనర్లు బాగా ఆడితే ఏ టీమ్ అయినా మంచి పొజిషన్‌లో ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ విషయంలో ఎలాంటి కంగారు అవసరం లేదు. అయితే చెన్నైలో సీఎస్‌కేని ఓడించే సత్తా ఉన్న టీమ్స్‌లో గుజరాత్ టైటాన్స్ కచ్చితంగా ఉంటుంది...
 

GT vs CSK

గుజరాత్ టైటాన్స్ రెండు సీజన్లుగా ఆడుతున్న గేమ్ చూస్తే షాకింగ్‌గా ఉంది. ఈసారి కూడా ఫైనల్ చేరితే టైటిల్ గెలవకుండా వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్... 

click me!